తెలంగాణ: వాగులో చిక్కుకున్న 8 మంది రైతులు.. రక్షించేందుకు స్థానికుల యత్నాలు

Siva Kodati |  
Published : Jul 15, 2021, 07:16 PM IST
తెలంగాణ: వాగులో చిక్కుకున్న 8 మంది రైతులు.. రక్షించేందుకు స్థానికుల యత్నాలు

సారాంశం

జగిత్యాల జిల్లాలో వ్యవసాయ పనులు ముగించుకుని ఇళ్లకు తిరిగి వస్తున్న ఎనిమిది మంది రైతులు వాగులో చిక్కుకుపోయారు. దీంతో వారిని గుర్తించిన స్థానికులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.   

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం సాతారంలో వాగు ఉద్ధృతి పెరగడంతో నీటిలో చిక్కుకుపోయారు రైతులు. మొత్తం ఎనిమిది మంది రైతులు వాగు మధ్యలో ఇరుక్కుపోయారు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులో వరద ఉద్ధృతి పెరిగి నీటిలో చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఇదే జిల్లాలోని మల్లాపూర్ మండలంలోని వెంపల్లి, కొత్తపేట్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ఉద్ధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ