రంగంలోకి దిగిన కేసిఆర్: కొండా సురేఖ సర్దుబాటు

By pratap reddyFirst Published Sep 17, 2018, 2:55 PM IST
Highlights

గణపతి నవరాత్రులను కొండా దంపతులు తమకు కీడుదినాలుగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు వాళ్లు ఇంటి గడప దాటరు, ఏ కార్యక్రమంలోనూ పాల్గొనరు. దీంతో నవరాత్రులు ముగిసిన తర్వాత వాళ్లు కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వరంగల్‌: కొండా దంపతులు జారిపోకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. కొండా సురేఖ, ఆయన భర్త కొండా మురళిలకు సర్దిచెప్పెందుకు టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. కొండా దంపతులతో చర్చలు జరిపేందుకు కేసీఆర్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

కాగా, గణపతి నవరాత్రులను కొండా దంపతులు తమకు కీడుదినాలుగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు వాళ్లు ఇంటి గడప దాటరు, ఏ కార్యక్రమంలోనూ పాల్గొనరు. దీంతో నవరాత్రులు ముగిసిన తర్వాత వాళ్లు కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 105 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేసిన కేసిఆర్ వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో సురేఖ అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీన్ని కొండా దంపతలు తమకు జరిగిన అవమానంగా భావించారు. దాంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేటి రామారావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. 

ఈ స్థితిలో ఓ కీలక నేత ఫోన్‌ చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, కేసీఆర్‌ సానుకూల దృకృథంతో ఉన్నారని అంతా మంచే జరుగుతుందని చెప్పినట్లు సమాచారం. దీంతో సురేఖ  బహిరంగ లేఖ విడుదలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

కొండా దంపతులు పార్టీని వీడితే రెండు మూడు సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు తెలియజేసినట్లు సమాచారం. కొండా దంపతులు వరంగల్‌ తూర్పు, పశ్చిమ, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరని ఆ వర్గాలు కేసిఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్‌ ముందు జాగ్రత్త చర్యగా కొండా మురళితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంతోపాటు మరో నియోజకవర్గంలో టికెట్‌ ఇచ్చే విషయంపై పరిశీలిస్తానని కేసిఆర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. కేసీఆర్ హామీతో పునరాలోచనలో పడిన కొండా దంపతులు టీఆర్ఎస్ ను వీడే విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తాకథనాలు చదవండి

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

click me!