అదే రిప్లై: షోకాజ్ నోటీసులపై కోమటిరెడ్డి రియాక్షన్

By narsimha lodeFirst Published Sep 26, 2018, 6:34 PM IST
Highlights

పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు

మునుగోడు: పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.  ఎన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చినా తనది అదే సమాధానమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.

బుధవారం నాడు  ఆయన  నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడారు.  పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి టిక్కెట్లు ఇవ్వాలన్నారు.  గెలిచే అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.టీడీపీతో పొత్తు పెట్టుకొన్న అభ్యంతరం లేదన్నారు.

 పార్టీ కార్యకర్తల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని తాను మాట్లాడినట్టు చెప్పారు. పార్టీ అధిష్టానం, పార్టీ క్రమశిక్షణ సంఘం ఏ నిర్ణయం తీసుకొన్నా  తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.

రెండోసారి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు బాధతోనే తాను మాట్లాడినట్టు చెప్పారు. ఎన్ని షోకాజ్ నోటీసులు  ఇచ్చినా అర్థం లేదన్నారు. ఎన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చినా తనది అదే సమాధానమని ఆయన చెప్పారు.

పదే పదే షోకాజ్‌లివ్వడంలో అర్థం లేదన్నారు. ఎన్ని షోకాజ్‌లిచ్చినా తనదే ఒకటే సమాధానమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించవద్దని ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులను కోరారు. మునుగోడు నుండి తనను పోటీ చేయాలని ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు.మునుగోడు నుండి తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీ: కోమటిరెడ్డిపై ఏం చేస్తారు?

తమ్ముడికి అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...కఠిన నిర్ణయాలు వద్దని సూచన

వదల బొమ్మాళీ: కోమటిరెడ్డికి మరో షోకాజ్ నోటీసు

షోకాజ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డోంట్ కేర్

సీల్డ్‌కవర్లో వివరణ: కోమటిరెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ

కాంగ్రెసుపై బ్రదర్ ఫైర్: కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజర్

కేసీఆర్ ను తిడితేనే పదవులిస్తారా: రేవంత్ కు కోమటిరెడ్డి సెటైర్

వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్

గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

 

click me!