కొడుకా.... నీ దగ్గరకే వాడిని కూడ పంపాను.. అంటూ మహేష్ తండ్రి బిగ్గరగా అరిచాడు
హైదరాబాద్: కొడుకా.... నీ దగ్గరకే వాడిని కూడ పంపాను.. అంటూ మహేష్ తండ్రి బిగ్గరగా అరిచాడు. బుధవారం నాడు మధ్యాహ్నం అత్తాపూర్‌లో రమేష్ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
2017 డిసెంబర్ 24వ తేదీన మహేష్‌గౌడ్ అనే యువకుడిని రమేష్ అతని స్నేహితులు కలిసి హత్య చేశారు. ఈ కేసు విషయమై కోర్టు నుండి రమేష్ తిరిగి వస్తుండగా మహేష్ గౌడ్ తండ్రి రమేష్‌ను గొడ్డలితో నరికి చంపాడు.
ఆ తర్వాత రమేష్ ను చంపిన గొడ్డలిని అక్కడే వేశాడు. రమేష్ చనిపోయాడని నిర్ధారించుకొన్న తర్వాత మహేష్ తండ్రి అందరి ముందే నవ్వుతూ ఆకాశంలోకి చూస్తూ...కొడుకా.. నీ దగ్గరే రమేష్‌ను కూడ పంపాను అంటూ అరిచాడు.
మహేష్‌ను చంపిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నాడు. మరోవైపు తన కొడుకును చంపిన రమేష్ ను చంపిన ఆనందంతో మహేష్ తండ్రి కన్పించాడు. ఈ ఆనందంలోనే కొడుకా.. నిన్ను చంపినవాడిని నీ వద్దకే పంపాను అంటూ ఆకాశం వైపు చూస్తూ బిగ్గరగా అరిచాడు.
సంబంధిత వార్తలు
10 నెలల క్రితం కొడుకు హత్య: అత్తాపూర్ మర్డర్ వెనుక కారణమిదే(వీడియో)
అత్తాపూర్ మర్డర్: వివాహితతో అఫైర్ వల్లనే అప్పుడు మహేష్, ఇప్పుడు రమేష్...