నగరంలో డేటింగ్ డ్రగ్ కలకలం... ఫ్యాక్టరీ సీజ్

By telugu teamFirst Published May 4, 2019, 8:48 AM IST
Highlights

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మరోసారి కలకలం రేపాయి. యువత డేటింగ్ డ్రగ్ పేరిట తీసుకునే డ్రగ్స్ ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. దీనిని క్లబ్ డ్రగ్ అని కూడా పిలిచే కేటమిన్‌ను ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీని నాచారం లో గుర్తించారు. 

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మరోసారి కలకలం రేపాయి. యువత డేటింగ్ డ్రగ్ పేరిట తీసుకునే డ్రగ్స్ ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. దీనిని క్లబ్ డ్రగ్ అని కూడా పిలిచే కేటమిన్‌ను ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీని నాచారం లో గుర్తించారు. కర్ణాటక- ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మాదక ద్రవ్యాల నియంత్రణ మండలి (ఎన్‌సీబీ) అధికారులు సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించారు.

 గత నెల 30న బెంగళూరులోని మెజిస్టిక్‌ ప్రాంతంలో కర్ణాటక ఎన్‌సీబీ అధికారులు అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తి ఒకరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బియ్యం బస్తాలో దాచిపెట్టిన 26.750 కిలోల తెల్లటి పదార్థాన్ని కనుగొన్నారు. దాని మీద పరిశోధనలు చేయగా.. అది కేటమిన్ గా తేలింది. దానిని సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకోగా... ఈ వ్యవహారం వెలుగు చూసింది.

ఈ డ్రగ్ ని యువత ఎక్కువగా వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కేటమిన్‌ను డేట్‌ డ్రగ్‌, క్లబ్‌ డ్రగ్‌గా పిలుస్తుంటారు. చిన్నచిన్న మాత్రల రూపంలో దీన్ని అమ్ముతుంటారు. మెదడుపై ప్రభావం చూపించే ఈ మత్తుమందు సేవిస్తే వాళ్లకి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్థితిలోకి వెళ్లిపోతారని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి అమ్మాయిలు ఈ మత్తు మందు తీసుకుంటే.. ఐదు గంటల పాటు స్పృహలో ఉండరు. 

అంటే ఒకవిధమైన భ్రాంతిలోకి వెళతారు. సరిగా మాట్లాడలేరు.. నడవలేరు.. చేతులు కదిలించలేరు. అందుకే పబ్బులు, క్లబ్బుల్లో యువతులు తాగే మద్యంలో ఈ మాత్రలు వేసి వారిపై అత్యాచారాలకు పాల్పడుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి.

click me!