ఈ నెల 26న హైద్రాబాద్‌కి మోడీ: అదే రోజున బెంగుళూరుకి కేసీఆర్

By narsimha lodeFirst Published May 23, 2022, 7:19 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 26 బెంగుళూరు వెళ్లనున్నారు. కేసీఆర్ వారం రోజుల టూర్ లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. దీంతో కేసీఆర్ ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి రానున్నారు.

హైదరాబాద్: Telangana సీఎం kCR వారం రోజుల పాటు వివిధ రాష్ట్రాల పర్యటనల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి.  ఈ నెల 26న కర్ణాటక  టూర్ కు వెళ్లనున్నారు.

ఈ నెల 20వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ Delhi కి వెళ్లారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించారు. Karnataka, Maharashtra ల్లో కూడా కేసీఆర్ పర్యటించాలని భావించారు.  అయితే చివరి నిమిషంలో  కేసీఆర్ టూర్ లో మార్పులు చోటు చేసుకొన్నాయి. పంజాబ్ పర్యటన తర్వాత కేసీఆర్ హైద్రాబాద్ కు చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ నెల 26వ తేదీన కేసీఆర్ బెంగుళూరు పర్యటనకు వెళ్లనున్నారు.

ఈ నెల 26నే హైద్రాబాద్ కు ప్రధానమంత్రి Narendra Modi  రానున్నారు. అదే రోజున కేసీఆర్ బెంగుళూరు టూర్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ ISB  లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే తాను ప్రధాని మోడీ టూర్ కు దూరంగా ఉంటానని కేసీఆర్ సమాచారం పంపాడు.ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కారణంగా ఈ కార్యక్రమానికి సీఎం రాలేరని సీఎంఓ ఐఎస్‌బీ సంస్థ కు సమాచారం పంపింది. సీనియర్ మంత్రిని ఈ కార్యక్రమానికి పంపుతామని కూడా సమాచారం ఇచ్చారు. 

ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు గాను సీనియర్ మంత్రిని పంపే అవకాశం ఉంది. గతంలో కూడా మోడీ హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో కేసీఆర్ మోడీకి స్వాగతం పలకలేదు. 

also read:చంఢీగడ్‌లో రైతులు, గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన కేసీఆర్ (ఫోటోలు)

ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైద్రాబాద్ కు వచ్చాడు.ఈ సమయంలో జ్వరం కారణంగా ప్రధాని మోడీ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు.  ప్రధానికి స్వాగతం పలకడానికి  కేసీఆర్ దూరం కావడంపై అప్పట్లో బీజేపీ నేతలు విమర్శలు చేశారు.  అయితే ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ శక్తి లేదా సంస్థ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ  విషయమై కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. మరో వైపు రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 3 లక్షల ఆర్ధిక సహాయం అందించారు. మరో వైపు గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేశారు. 

ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కేసీఆర్ ఇవాళ రాత్రికి హైద్రాబాద్ కు రానున్నారు. ఈ నెల 27న కేసీఆర్ మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దిలో అన్నా హజారేను కలవాల్సి ఉంది,. అయితే  బెంగుళూరు నుండి మహారాష్ట్రకు వెళ్తారా లేదా అనేది  ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే తెలంగాణకు ప్రధాని మోడీ ఏం చేశాడని ఆయనకు స్వాగతం పలకాలని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఎందుకు మోడీకి సన్మానం చేయాలని ప్రశ్నించారు మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు . తెలంగాణకు కేంద్రం నుండి సరైన సహకారం లేదని కూడా ఆయన విమర్శలు చేశారు.
 

click me!