కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దుమారం: హై కమాండ్‌కి ఫిర్యాదు చేస్తానన్న వీహెచ్

By narsimha lodeFirst Published May 23, 2022, 5:21 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వి. హనుమంతరావు చెప్పారు. 
 

హైదరాబాద్: తెలంగాణ Congress లో టీపీసీసీ చీఫ్ Revanth Reddy వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.రెడ్డి సామాజిక వర్గంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇతర సామాజిక వర్గాలను పార్టీకి దూరం చేసేలా ఉన్నాయని  కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను  పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని కూడా ఆయన ప్రకటించారు.

సోమవారం నాడు  కాంగ్రెస్ సీనియర్ నేత V.Hanumantha Rao  ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎస్సీ, ST, బీసీ, మైనార్టీలను  కాంగ్రెస్ వైపునకు తిప్పుకొంటేనే అధికారం దక్కే అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశాడో తనకు తెలియదన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు BC, SC, ఎస్టీల్లో ఓ విధమైన ఆలోచన వచ్చిందన్నారు. మెజారిటీ వర్గాలను దూరం చేసుకొంటే పార్టీకి నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  మాణికం ఠాగూర్ లు ఆదేశాల మేరకు పార్టీ అంతరగత సమావేశాల్లోనే దీనిపై మాట్లాడుతానని వి. హనుమంతరావు చెప్పారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డిని ఈ విషయమై అడుగుతానని వీహెచ్ చెప్పారు.


మీ పార్టీలు గెలవాలన్నా రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి పతనమయ్యాడని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రెడ్లకు అవకాశం ఇవ్వండి రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తానంటూ సవాల్ విసిరారు. ఆదివారం నాడు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు, నష్టపోలేదన్నారు. ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారని.. దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు, బలహీన వర్గాలకు దూరం అవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

also read:రెడ్లకు పగ్గాలిస్తేనే.. పార్టీలకు మనుగడ, వైఎస్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి : రేవంత్ సంచలన వ్యాఖ్యలు

వ్యవసాయం వదిలేసి అందరికీ దూరం అవుతున్నామని  రెడ్డి సోదరులు వ్యవసాయం వదలొద్దని ఆయన సూచించారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి పద్మనాయకులను దగ్గరికి తీశాడని రేవంత్ గుర్తుచేశారు. పద్మ నాయకులు అంటే వెలమలని, రెడ్లను పక్కన పెట్టి..వెలమలను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. ఆనాటి నుండి.. ఈనాటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు కూడా తప్పు బట్టారు. కాకతీయ సామ్రాజ్యం పై అవగాహన లేకే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావులు విమర్శించారు. ఏదైనా విషయంపై మాట్లాడే సమయంలో కనీస సమాచారం లేకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు.

click me!