బీసీల అభివృద్ది కోసం తాను పార్టీలను వాడుకొంటానని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్సుడు ఆర్. కృష్ణయ్య చెప్పారు. తనను వాడుకొని 2014లో టీడీపీ గెలిచిందన్నారు.
హైదరాబాద్: బీసీల అభివృద్ది కోసం తాను పార్టీలను వాడుకుంటున్నానని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, YCP రాజ్యసభ అభ్యర్ధి ఆర్. కృష్ణయ్య చెప్పారు.
ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో R. Krishnaiah పలు విషయాలను వెల్లడించారు.
TDP 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందన్నారు. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నానని ఆర్. కృష్ణయ్య చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గుర్తించారన్నారు.కానీ, ముందుగా ఏపీ సీఎం YS Jagan అవకాశం ఇచ్చారని చెప్పారు.
BCలు బాగుండాలి, బీసీలు ఎదగాలని పోరాటాలు చేసే తాను పదవుల కోసం పని చేస్తారనేది అపోహ మాత్రమే అని ఆర్.కృష్ణయ్య అన్నారు. తాను దివంగత NTR హయాంలోనే మంత్రి పదవిని వదులకున్నానని చెప్పారు. తాను ఏనాడూ పదవుల కోసం పని చేయలేదన్నారు. తనకు Rajya Sabha పదవి రావడం వల్ల బీసీల ఔన్నత్యం పెరుగుతుందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. బీసీల సమస్యలు రాజ్యసభలో ప్రస్తావిస్తానన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన బీసీల సమస్యలతో పాటు జాతీయ స్థాయిలో బీసీల సమస్యలను ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు.
తనకు పదవి ఇచ్చి సీఎం జగన్ ఇబ్బందులు పడుతున్నారనేది అపోహ మాత్రమే అని కృష్ణయ్య అన్నారు. తనకు పదవి ఇవ్వడం సరైనదేనా అని మీరు కూడా సర్వే చేయండని మీడియాకు సూచించారు. ఎవరైనా తప్పంటే తాను గుండు గీయించుకుంటానని వ్యాఖ్యానించారు. 1976 నుంచి తాను ఉద్యమంలో ఉన్నానని ఆయన గుర్తు చేశారు. తనను వాడుకుని టీడీపీ గెలిచిందన్నారు. ఒక్కోసారి తానే పార్టీలను వాడుకున్నానని స్పష్టం చేశారు.
also read:రాష్ట్రంలో బీసీ నేతలతో బస్సు యాత్ర: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
వైసీపీ మాత్రం బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇచ్చిందని కృష్ణయ్య చెప్పారు. అలాగే, బడుగు నేతలు బాడుగ నేతలు అవుతున్నారన్న విమర్శల్ని తప్పుబట్టారు. కొంతమంది బీసీ నేతలు జాతి అభివృద్ధి కోసం తమ ఆస్తులు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాను పార్టీలు మారలేదన్నారు.
పార్టీలనే తాను చేసే ఉద్యమం వైపు తిప్పుకుంటున్నానని చెప్పారు. గతంలో దమ్మున్న నేతలు కూడా బీసీలకు ఎక్కువ పదవులు ఇవ్వలేదన్నారన్నారు. బీసీల నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్న తాను బడుగు, బలహీనవర్గాల స్వరంగా మారతానని వెల్లడించారు.
2014 ఎన్నికలకు ముందు ఆర్. కృష్ణయ్య టీడీపీలో చేరారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తానని కూడా చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణలోని ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుండి ఆర్. కృష్ణయ్య టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో ఆర్. కృష్ణయ్య టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలోనే ఆర్.కృష్ణయ్య కు Congress పార్టీ టికెట్ ఇచ్చింది. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి ఆర్. కృష్ణయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
గత కొంత కాలంలో ఆర్. కృష్ణయ్య వైఎస్ జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీసీలకు అనుకూలంగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటున్నారని ప్రశంసలు గుప్పిస్తున్నారు.ఈ తరుణంలోనే కృష్ణయ్యకు జగన్ రాజ్యసభ సీటు కేటాయించారు.