ఇండియా మోడీ జాగీరా...ఎన్నికల తర్వాత అందరి లెక్కా తేలుస్తా: కేసీఆర్

By sivanagaprasad KodatiFirst Published Nov 28, 2018, 2:31 PM IST
Highlights

తప్పుంటే ఎన్నిసార్లు విమర్శించినా పడటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ నారాయణఖేడ్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు

తప్పుంటే ఎన్నిసార్లు విమర్శించినా పడటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ నారాయణఖేడ్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా సచివాలయంలో పైరవీకారులు మాయమయ్యారని, అవినీతి లేదని, గుడుంబా బట్టీలు, పేకాట క్లబ్బులు లేవన్నారు. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ లేదని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ నేతలు ఆంధ్రా నుంచి చంద్రబాబును తెచ్చుకున్నారని.. ఇంకా ఆంధ్రా పెత్తనం తెలంగాణకు అవసరమా అని సీఎం ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేన్లు కావాలంటూ అసెంబ్లీ తీర్మానం చేయించి పంపామని... 30 సార్లు ఢిల్లీకి వెళ్లి మోడీకి చెప్పానన్నారు.

కానీ కేంద్రం తమ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదంటూ.. అంతేకాకుండా ముస్లింలకు రిజర్వేషన్లు రాకుండా చేస్తామంటూ మాట్లాడుతున్నారని ఇండియా మోడీ జాగీరా అని కేసీఆర్ మండిపడ్డారు.

రాష్ట్రాల హక్కుల కోసం తాను పోరాడుతున్నానని.. ఎన్నికలు ముగిసిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ రావాలని అప్పుడే రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని కేసీఆర్ స్పస్టం చేశారు. 

ఆంధ్రా రైతులు మన రైతుల గురించి మాట్లాడుకోవాలి: కేసీఆర్

బీజేపీ, టీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదు:సుష్మాస్వరాజ్ క్లారిటీ

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్: రాహుల్ గాంధీ

డిసెంబర్ 11 సాయంత్రం.. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపుదాం: కోదండరాం

కాంగ్రెస్ గెలవాలి, కేసీఆర్ గుండె అదరాలి: రేవంత్ రెడ్డి

అందరూ సీఎంలు దొబ్బితిన్నారు.. ఎన్టీఆర్‌ కూడా: కేసీఆర్

నందమూరి సుహాసినికి షాక్...ప్రచారానికి రానన్న భువనేశ్వరి
 

click me!