ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

By narsimha lodeFirst Published Jan 2, 2019, 6:32 PM IST
Highlights

 తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ  మరింత జాప్యం కానుంది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ  మరింత జాప్యం కానుంది.  ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉంది. గ్రామ పంచాయితీ ఎన్నికలు కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడేలా చేశాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్  గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణం తనతో పాటు మహమూద్ అలీతో  ేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. మహమూద్ అలీకి హోం మంత్రిత్వశాఖను కట్టబెట్టారు.

ఈ దఫా కనీసం ఎనిమిది మందికి కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సంక్రాంతి తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశగా ఉన్నారు.

మంత్రివర్గంలో చోటు కోసం  ఆశగా ఎదురు చూస్తున్నారు. కేబినెట్ బెర్త్ కోసం  కేటీఆర్‌ను, కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  కేబినెట్‌లో సీఎం కేసీఆర్‌తో సహా 17 మందికి అవకాశం ఉంటుంది.

అయితే కేబినెట్‌లో మరో 16 మందికి మాత్రమే చాన్స్ ఉంటుంది.  ఈ 16 మందిలో తొలి విడతగా  ఎనిమిది మందికి కేసీఆర్ ఛాన్స్ ఇవ్వనున్నారు. అయితే ఈ ఎనిమిది మందిలో కూడ నలుగురు పాత వారికి ఛాన్స్ దక్కనుంది. మిగిలిన నలుగురు కొత్తవారికి చాన్స్  దక్కే అవకాశం లేకపోలేదు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత  కేసీఆర్ తన  మంత్రివర్గాన్ని పూర్తి స్థాయి కేబినెట్ ఉండే అవకాశం ఉంది. కేంద్రంలోని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా  పనిచేయాలని భావించి కేటీఆర్ కు సీఎం పగ్గాలు ఇస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. 

ఈ కారణాల రీత్యానే పార్లమెంట్ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కేబినెట్‌ను పార్లమెంట్ ఎన్నికల వరకు  ఏర్పాటు చేయకుండా ఉంచారనే  ప్రచారం కూడ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.

అయితే రాష్ట్రంలో మూడు విడతల్లో  గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని  ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు జనవరి 1వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.ఈ ఎన్నికల షెడ్యూల్  విడుదల కావడంతో  ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

కేబినెట్ విస్తరణ కూడ  చేయకూడదని  ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేబినెట్‌లో బెర్త్ కోసం ఎదురు చూస్తున్న నేతలకు ఎన్నికల కోడ్ షాక్‌ కల్గించింది. ఫిబ్రవరి మాసంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుంది. కేబినెట్ విస్తరణ చేస్తే గ్రామ పంచాయితీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందనే ఉద్దేశ్యంతో కేబినెట్ విస్తరణ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

మరోవైపు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఆ పార్టీల నుండి టీఆర్ఎస్ లో  చేరే ప్రజా ప్రతినిధులకు కూడ కేబినెట్‌లో బెర్త్ కేటాయించడం కోసం మంత్రివర్గ విస్తరణను కేసీఆర్ వాయిదా వేస్తున్నారనే ప్రచారం కూడ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఫిబ్రవరి నాటికి  ఇతర పార్టీల నుండి  చేరే వారెవరనే విషయమై స్పష్టత రానుంది.దీంతో  ఫిబ్రవరిలో  కేబినెట్  విస్తరణ ఉండే చాన్స్ ఉంది.


సంబంధిత వార్తలు

గ్రామ పంచాయితీ ఎన్నికల ఎఫెక్ట్: ఎమ్మెల్యేల ప్రమాణం ఎప్పుడు

కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌తో తాజా ఎమ్మెల్యే బేరసారాలు

ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

ఈ సారైనా ఆ నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కేనా

click me!