టీఆర్ఎస్‌లో చేరడం లేదు: అజహరుద్దీన్

By narsimha lodeFirst Published Jan 2, 2019, 5:43 PM IST
Highlights

 తాను టీఆర్ఎస్‌లో చేరుతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  మహమ్మద్ అజహరుద్దీన్   స్పష్టం చేశారు.


హైదరాబాద్: తాను టీఆర్ఎస్‌లో చేరుతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  మహమ్మద్ అజహరుద్దీన్   స్పష్టం చేశారు.టీఆర్ఎస్ లో తాను చేరుతున్నానని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. 

రెండు రోజుల క్రితం అజహరుద్దీన్ టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఓ పెళ్లి వేడుకలో  టీఆర్ఎస్ నేతలతో  అజహారుద్దీన్ చర్చించినట్టు మీడియాలో  వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని  అజాహరుద్దీన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

తాను టీఆర్ఎస్ లో చేరుతాననే వార్తల్లో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు.  ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనే అజారుద్దీన్‌ను  కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే టీఆర్ఎస్‌లో  చేరిన తన సన్నిహితుల ద్వారా అజహరుద్దీన్  ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బ్రేక్ వేస్తూ అజహరుద్దీన్  ట్వీట్ చేశారు.

 

The news doing the rounds in the media of me joining the TRS party in Telangana is incorrect & false.

— Mohammed Azharuddin (@azharflicks)


 

click me!