లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై సినీనటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

Published : Jan 02, 2019, 06:11 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై సినీనటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వివాదాస్పద సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సినీనటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన శివాజీ  రామ్ గోపాల్ వర్మ తెరకెక్కుస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందించారు. 

హైదరాబాద్: వివాదాస్పద సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సినీనటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన శివాజీ  రామ్ గోపాల్ వర్మ తెరకెక్కుస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందించారు. 

వెన్నుపోటుకు వెన్నుదన్నుకు తేడా తెలియని వ్యక్తి సినిమాలు తీస్తున్నారంటూ విమర్శించారు. రామ్ గోపాల్ వర్మ సినిమాను తాను వ్యతిరేకించడం లేదన్న శివాజీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏం ఉంటుందో చూద్దాం అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలలో ఎన్టీఆర్ బయోపిక్ కు మంచి గుర్తింపు ఉందన్నారు. 

లక్ష్మీ పార్వతికి ఏం చరిత్ర ఉందని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు సినీనటుడు శివాజీ. హోటల్ వైశ్రాయ్ ఘటనకు లక్ష్మీపార్వతి మనుషులే కారణం అంటూ శివాజీ ఆరోపించారు.     

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు