ఓడిపోయినవారిని కేబినెట్‌లోకి తీసుకోను: కేసీఆర్

By narsimha lodeFirst Published Dec 12, 2018, 6:28 PM IST
Highlights

ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన మంత్రులను  కేబినెట్‌లోకి తీసుకోనని  కేసీఆర్ ప్రకటించారు.
 


హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన మంత్రులను  కేబినెట్‌లోకి తీసుకోనని  కేసీఆర్ ప్రకటించారు.

బుధవారం నాడు కేసీఆర్  మీడియాతో చిట్ చాట్  చేశారు. కేసీఆర్ కేబినెట్‌లో పనిచేసిన నలుగురు మంత్రులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.ఓటమి పాలైన వారితో కూడ మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. అయితే ఓటమి పాలైన మంత్రులను కేబినెట్‌లోకి  తీసుకోనని కేసీఆర్ ప్రకటించారు.

ఓడిపోయిన వారిని  కేబినెట్‌లోకి తీసుకొంటే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే  కేబినెట్‌లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు. అయితే గతంలో కేసీఆర్ కేబినెట్‌లో మహిళలకు స్థానం లేదు. ఈ దఫా మహిళలకు కేబినెట్‌లో స్థానం కల్పించే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు

సోనియా అడిగారు, నేను కాదన్నాను: గుట్టువిప్పిన కేసీఆర్

విజేతలు వారే: అప్పుడు ఆ పార్టీల నుంచి... ఇప్పుడు టీఆర్ఎస్
కేసీఆర్ ముహుర్తం వెనుక ఆంతర్యమిదే

ఏపీలో కాలు పెట్టడం ఖాయం: కేసీఆర్

ఇతర పార్టీల కీలకనేతలు మా వైపు వస్తారు: కేసీఆర్

టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక

కేసీఆర్ ప్రమాణానికి ముహుర్తం ఇదే: ఒక్కరితోనే కొలువు

 

click me!