రేవంత్ రెడ్డి హర్ట్ అయిండు

First Published Oct 26, 2017, 1:20 PM IST
Highlights
  • అధినేతను కలిసే వరకు ఆగకుండా విమర్శలు
  • కేడర్ ను చూస్తే బాధ కలుగుతున్నది
  • సీనియర్లు తిడుతున్నా పట్టించుకోరా?

రేవంత్ రెడ్డి చిన్నబుచ్చుకున్నడు. కలత చెందిండు. తెలుగుదేశం పార్టీలో తన మీద విరుచుకుపడుతున్న నేతలను కట్టడి చేయకుండా తనను మాత్రమే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందిండు. పూర్తి విషయాలను పార్టీ అధినేత వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతా అని చెప్పిన తర్వాత కూడా తనమీద రాళ్లేస్తున్నరని బాధపడ్డరు. పార్టీ అధినేత హైదరాబాద్ వచ్చేలోపు పార్టీని సర్వనాశనం చేయాలని పార్టీలోని కొందరు సీనియర్లు చూస్తున్నారని రేవంత్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిండు.

తాజా పరిణామాలపై రేవంత్ తన ఆవేదనను వెల్లడించారు. తాను బాబును కలవకముందే విమర్శలు చేస్తున్నారని అన్నారు. తీరా బాబు వచ్చినా, ఆయనను కలిసినా సరిద్దిద్దుకోలేని విధంగా చేయాలని పార్టీలోని కొందరు తాపత్రయ పడుతున్నారని ఆరోపించిండు. టీడీపీలో అంతర్గత గోడవలను కొందరు సృష్టించాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు.

తన పోరాటం కేసీఆర్ పైనే తప్ప టిడిపి పార్టీలో నేతల మీద కాదని మరోసారి స్పస్టం చేసిండు. టిడిపిలో తాజాగా జరుగుతున్న పరిణామాలన్నీ కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిండు. పార్టీలో తనతో కలిసి పనిచేసిన కేడర్ ను చూస్తే బాధగా ఉందన్నడు.

తాను అధినేత వచ్చాక అన్ని వివరిస్తా అని చెప్పినా మీడియా ముందు పార్టీలో కొందరు నన్ను పరుష పదజాలంతో విమర్శిస్తున్నా కూడా పార్టీ అధ్యక్షుడు రమణ కాస్త కూడా వాళ్ళను నిలువరించలేదని ఆవేదన వ్యక్తం చేసిండు.

తనను టిడిఎల్పీ సమావేశం జరపొద్దని చెప్పడంతో దానికి సమ్మతించాడు రేవంత్. గురువారం అసెంబ్లీకి వెళ్లిన తర్వాత కూడా టిడిఎల్పీలో టిడిఎల్పీ నేత కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఇంకో కుర్చీలో కూర్చున్నాడు.

మొత్తానికి తాజా పరిణామాలు చూస్తే... రేవంత్ ఒక అడుగు వెనక్కు తగ్గినట్లు కనబడుతున్నది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లక్ష్మిపార్వతి షాకింగ్ నిర్ణయం (వీడియో) చూడండి

https://goo.gl/CcQSvc

click me!