చిలక ఇక్కడిది... పలుకు అక్కడిది

Published : Jan 17, 2017, 01:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
చిలక ఇక్కడిది... పలుకు అక్కడిది

సారాంశం

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ ఫైర్

మాటల మరాఠీగా శత్రువుల నుంచి కూడా ప్రశంసలందుకునే సీఎం కేసీఆర్ ను మించిపోయారు ఆయన తనయుడు మంత్రి కేటీఆర్. ముఖ్యంగా తండ్రిని తలపించే రీతిలో ఆయన మాటల తూటాలు పేలుస్తున్నారు.

 

అసెంబ్లీ లో చర్చ సందర్భంగా పదే పదే తన ప్రసంగానికి అడ్డుతగులుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి తో ఆడుకున్నారు.

 

చిలక ఇక్కడిదే కానీ... కానీ పలుకులు మాత్రం అక్కడివి అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డి ఆంధ్రా ఏజెంట్ అని ఎద్దెవా చేశారు.

 

దేశానికి స్వాత్రం వచ్చినపుడు బ్రిటీష్ వారు కొన్ని అవశేషాలను వదిలి వెళ్లినట్లు తెలంగాణ వచ్చిన తరువాత ఆంధ్రాపార్టీ వదిలివెళ్లిన అవశేషమే ఈయన ( రేవంత్ రెడ్డి) అని అనడంతో అక్కడున్న గులాబీ శ్రేణులు ఫక్కున నవ్వాయి. పాపం రేవంత్ ... గుక్కతిప్పుకోకుండా కేటీఆర్ మాటల తూటాలు పేల్చడంతో సైలెంట్ గా ఉండిపోయారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్