( వీడియో) ప్రవచనాల చాగంటి.. ఇంతపని చేశారేంటీ ?

Published : Jan 17, 2017, 01:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
( వీడియో) ప్రవచనాల చాగంటి.. ఇంతపని చేశారేంటీ ?

సారాంశం

చాగంటి కోటేశ్వరరావు తమ కులాన్ని కించపరిచారని యాదవ సంఘం నేతలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  

చాగంటి గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. టీవీ చానళ్లలో ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వరరావును ఇటీవల ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా నియమించింది. పద్మ అవార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆయన పేరును కూడా నామినేట్ చేసింది.

 

అయితే గత ఆదివారం ఓ టీవీ చానెల్ లో ప్రవచనాలు చెబుతూ చాగంటి కోటేశ్వరరావు తమ కులాన్ని కించపరిచారని యాదవ సంఘం నేతలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 

హైదరాబాద్‌ టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం చాగంటిపై ఫిర్యాదు చేసినట్లు యాదవ కులస్థులు అఖిలభారత యాదవ మహాసభ నగర కార్యదర్శి అశోక్‌కుమార్‌ మీడియాకు తెలిపారు.

యాదవులను కించపరిచిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్