
తెలంగాణ సిఎం కెసిఆర్ తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. కొత్త సచివాలయాన్ని డిఫెన్స్ శాఖ కు సంబంధించిన భూమిలో నిర్మించడానికి కేంద్రం పై కెసిఆర్ వత్తిడి చేయడం చూస్తే తుగ్లక్ పాలన గుర్తుకొస్తుందన్నారు. గతంలో చెస్ట్ హాస్పిటల్ ని కూడా తరలించాలని చూశాడని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం వున్న సచివాలయం 60%వృధాగానే వుంది. అయినా కొత్త సచివాలయం అవసరమేంటి అని ప్రశ్నించారు మర్రి. కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే డబ్బుల కోసమే కొత్త సెక్రెటేరియెట్ కట్టాలని ఆలోచిస్తున్నాడని విమర్శించారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. ఆ చర్యను అడ్డుకుని తీరుతామన్నారు.