
రాష్ట్ర విభజన జరిగి రెండేన్నరేళ్లు దాటింది. కానీ, ఇంకా పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ప్రకారం ఏపీతో పంపకాలు జరుగుతూనే ఉన్నాయి.
దీనిపై ఇప్పటివరకు రెండు రాష్ట్రాల సీఎంలు పెద్దగా దృష్టి సారించలేదనే చెప్పాలి.
మరోవైపు తెలంగాణ హైకోర్టు ఏర్పాటు ఇంకా ఎండమావిగానే మిగిలిపోయింది.
ఈ నేపథ్యంలో ఏపీ తో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
సచివాలయ భవనాల అప్పగింత, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ఈ కమిటీని నియమించారు.
ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలు ఈ కమిటీలో సభ్యులుగా సీఎం కేసీఆర్ నియమించారు.
గవర్నర్ నరసింహన్ సమక్షంలో చర్చలకు ఈ కమిటీ వెళ్లనుంది.