
ఆరుపదుల వయసులో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు ఎట్టకేలకు ఇంటివారయ్యారు. అదీ లేటు వయసులో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం విశేషం.
సుదీర్ఘ కాలం తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలంగా పనిచేసిన నారదాసు ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీగాను రాణిస్తున్నారు.
హైదరాబాద్ కు చెందిన వర్ష అనే న్యాయవాదిని ప్రేమించిన నారదాసు.. నాంపల్లిలోని రిజస్టర్ ఆఫీసులో శుక్రవారం ఆమెను పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం నారదాసు వయసు 61 ఏళ్లు. లేటు వయసులోనైనా నారదాసు ఒక ఇంటివాడవడం పట్ల ఆయన సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.