చంద్రబాబు అరెస్ట్ వెనుక కేసీఆర్, మోడీ హస్తం.. : కాంగ్రెస్ తీవ్ర ఆరోప‌ణ‌లు

By Mahesh Rajamoni  |  First Published Sep 19, 2023, 4:54 PM IST

Hyderabad: ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్టు వెనుక తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్), ప్ర‌ధాని నరేంద్ర మోడీలు ఉన్నార‌ని కాంగ్రెస్ నాయ‌కుడు మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అంత‌కుముందు, అరెస్టు నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు సంఘీభావం తెలపాలని కాంగ్రెస్ నిర్ణయించిందని ఆ పార్టీ ఏపీ నేత తులసిరెడ్డి తెలిపారు.
 


Congress leader Madhu Yaskhi Goud : ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్టు వెనుక ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్), ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఉన్నార‌ని కాంగ్రెస్ నాయ‌కుడు మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అంత‌కుముందు, అరెస్టు నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు సంఘీభావం తెలపాలని కాంగ్రెస్ నిర్ణయించిందని ఆ పార్టీ నేత తులసిరెడ్డి తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టు వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ హస్తం ఉందని కాంగ్రెస్ నేత మధు గౌడ్ యాష్కీ ఆరోపించారు. కేసీఆర్, మోడీ కుట్రతోనే ఆంధ్రప్రదేశ్ లోని వైస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసిందని తన వద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడును బెయిల్ పై విడుదల చేయించే ప్రయత్నాలు కూడా ఆగిపోతున్నాయని ఆయన ఆరోపించినట్టు సియాసత్ నివేదించింది.

Latest Videos

undefined

2019 ఎన్నికల్లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మ‌ధుయాష్కీ మీడియాతో అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వైదొలిగినప్పటి నుంచి చంద్రబాబుకు, మోడీకి మధ్య  విభేధాలు పెరిగాయ‌ని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఇప్పటికే ఈ అంశంపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారని మాజీ ఎంపీ తెలిపారు. ఏదైనా నేరం జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల‌ని అన్నారు. చంద్రబాబు అరెస్టును తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సైతం ఖండించారు. టీడీపీ నేత అరెస్టును ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి తప్పుబట్టారు. నిజంగా కేసు ఉంటే తనకు ముందస్తు నోటీసులు ఇచ్చి ఉండాల్సిందని ఆయన అన్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తులసిరెడ్డి తెలిపారు.

click me!