మహిళా రిజర్వేషన్ బిల్లు ..కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 19, 2023, 04:41 PM IST
మహిళా రిజర్వేషన్ బిల్లు ..కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సారాంశం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు . అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో జరగవని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వర్తించదన్నారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నారు. ఆ తర్వాతే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని ఉత్తమ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో జరగవని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు. రేపటి నుంచే ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 

కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు హామీలను త్వరితగతిన అమలు చేస్తుందనీ, కేసీఆర్ ప్రభుత్వానికి 99 రోజులే మిగిలాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ‌లో జరిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప‌లు ఎన్నిక‌లు హామీల‌ను ప్ర‌క‌టించింది.

ALso Read: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు .. రేపు చర్చ, ఎల్లుండి రాజ్యసభలో

మహాలక్ష్మి పథకం, చేయూత, రైతు భరోసా, అంబేద్కర్ అభయహస్తం, యువ వికాసం, మహిళా సాధికారత కింద సోనియాగాంధీ చేసిన ఆరు హామీలను గురించి మ‌రోసారి రేవంత్ రెడ్డి ప్ర‌స్తావిస్తూ.. అధికారంలోకి వ‌చ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామనీ, ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికను తొలి కేబినెట్‌ సమావేశంలోనే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.

గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ స‌ర్కారుపై ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. మహాలక్ష్మి పథకం, చేయూత, రైతు భరోసా, అంబేద్కర్ అభయహస్తం, యువ వికాసం, మహిళా సాధికారత కింద సోనియాగాంధీ చేసిన ఆరు హామీలను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లు చేస్తామ‌ని రేవంత్ చెప్పారు. 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామనీ, ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికను తొలి కేబినెట్‌ సమావేశంలోనే నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?