పెద్దపల్లిలో దారుణం... కత్తులతో మెడనరికి రియల్టర్ దారుణ హత్య

Published : Sep 19, 2023, 04:46 PM IST
పెద్దపల్లిలో దారుణం... కత్తులతో మెడనరికి రియల్టర్ దారుణ హత్య

సారాంశం

పెద్దపల్లి జిల్లాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. అతడి హత్యకు భూతగాదాలే కారణమని తెలుస్తోంది. 

పెద్దపల్లి : ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్న రియల్టర్ పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసారు. కత్తులు, కొడవళ్లలో మెడ నరికి అతి కిరాతకంగా చంపారు. 

పోలీసులు, బాధిత కుటుంబం కథనం ప్రకారం... రామగుండం సమీపంలోని ఖాజీపల్లికి చెందిన మేకల లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. భూముల అమ్మకం, కొనగోలు సమయంలో అనేక వివాదాలు తలెత్తేవి... కొన్నిసార్లు వివాదాల్లో వున్న భూముల్లో తలదూర్చాల్సి వచ్చేది. ఈ భూతగాదాలే కారణమో లేక ఇంకేమయిన ఇతర కారణాలో తెలీదుగానీ సోమవారం రాత్రి లింగయ్య హత్యకు గురయ్యాడు. 

సోమవారం రాత్రి లింగయ్య ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుండగా పోచమ్మ  గుడివద్ద కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. లింగయ్య కోసం మాటువేసిన దుండగులు అతడు రాగానే ఒక్కసారిగా కత్తులు, కొడవళ్లతో దాడికి దిగారు. అతడి మెడపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  

Read More  భార్య దూరపు బంధువుతో వివాహేతర సంబంధం.. దారుణ హ‌త్య‌..

లింగయ్య చావుకేకలు విని గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకునేసరికి లింగయ్య రక్తపుమడుగులో పడివున్నాడు. అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు ఏసిపి శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లింగయ్య హత్యకు భూవివాదాలే కారణమని అనుమానిస్తున్నారు. హంతకులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !