KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు.. 15 రోజుల్లో హాజరు కావాల‌ని ఆదేశాలు

Published : May 20, 2025, 01:46 PM IST
k chandrashekar rao

సారాంశం

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు అధికారు.  

తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారికంగా విచారణ నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులు కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్‌కు కూడా జారీ చేసినట్లు సమాచారం. వీరికి 15 రోజుల గడువు ఇచ్చి, కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదం – కేసు నేపథ్యం

తెలంగాణలో 2016లో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్ట్, దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అధిక వ్యయం, డిజైన్ లోపాలు, ఎలాంటి కేంద్ర అనుమతులు లేకుండా పనులు చేయడం, అలాగే ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ దిగుడు గేట్లు పాడవడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, విజిలెన్స్, తదితర సంస్థలతో పలు విచారణలు ప్రారంభించింది. తాజాగా ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ పీనీ ఘోష్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్‌ ప్రస్తుతం నిధుల వినియోగం, టెండర్ల ప్రక్రియ, నిర్మాణ లోపాలు, వ్యవస్థాపక నిర్ణయాలు వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలన చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌లకు సమన్లు పంపిస్తూ ఆ స‌మ‌యంలో వారు తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలనీ కోరిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ కేసు ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల జోరు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్
గద్దర్ అన్నకు కార్ కొనించానని చెప్పడానికి సిగ్గు లేదు..! | Kavitha Aggressive Words On Pawan Kalyan