అనుమానాస్పదస్థితిలో యువతి మృతి: ప్రియుడిపైనే అనుమానం

Published : Apr 16, 2019, 04:10 PM ISTUpdated : Apr 16, 2019, 04:58 PM IST
అనుమానాస్పదస్థితిలో యువతి మృతి: ప్రియుడిపైనే అనుమానం

సారాంశం

హైదరాబాద్ కూకట్‌పల్లిలో మంగళవారం నాడు దారుణం చోటు చేసుకొంది. జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. జ్యోతి మృతికి ప్రియుడు రాకేష్ కారణమని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లిలో మంగళవారం నాడు దారుణం చోటు చేసుకొంది. జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. జ్యోతి మృతికి ప్రియుడు రాకేష్ కారణమని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సోమవారం రాత్రి జ్యోతిని ఆమె ప్రియుడు రాకేష్ రెడ్డి బయటకు తీసుకెళ్లాడు. మంగళవారం నాడు ఉదయానికి  జ్యోతి ఆసుపత్రిలో చేరింది. ప్రియుడు రాకేష్  కూల్‌డ్రింకులో విషమిచ్చి ఆమెకు తాగించాడని  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మృత్యువాత పడింది.

జ్యోతిని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత రాకేష్  పారిపోయాడు. తమ కూతురు మరణానికి రాకేష్ కారణమని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని రాకేష్ కొంత కాలంగా ఒత్తిడి తీసుకొస్తున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా కొహెడ మండలానికి చెందిన సిద్దిరాల జ్యోతి (24) కేపీహెచ్‌బీ ఫేజ్‌-4లో గత కొంతకాలంగా నివాసం ఉంటోంది. ఆమె బేగంపేట్‌ ప్రకాశ్‌నగర్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తుంది.. రెండేళ్ల క్రితం స్వగ్రామంలో ఉన్న సమయంలో రాకేశ్‌రెడ్డి అనే యువకుడు జ్యోతిని ప్రేమించాలంటూ వెంటపడి వేధించేవాడు. 

ఆ తర్వాత జ్యోతి కేపీహెచ్‌బీలోని ఫేజ్‌-4కు వచ్చి నివాసముంటోంది.ఈ క్రమంలో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఇంటర్‌నెట్‌ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న రాకేశ్‌రెడ్డి ఇక్కడ కూడా యువతిని వేధించసాగాడు. సోమవారం రాత్రి పూట రాకేష్.... జ్యోతిని కలిశాడు.  ఆ తర్వాత కొద్దిసేపటికే జ్యోతి విషం తాగిందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మంగళవారం నాడు మధ్యాహ్నం మరణించింది.
 

సంబంధత వార్తలు

టెక్కీ లావణ్య హత్య ఘటనలో ప్రియుడి డ్రామా ఇదీ....

టెక్కీ లావణ్య హత్య కేసులో ట్విస్ట్: పేరేంట్స్‌ను నమ్మించాడు

టెక్కీ లావణ్య కేసు: ఇంటర్వ్యూకు తీసుకెళ్తున్నానని చెప్పి హత్య

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య: ప్రియుడే హంతకుడు

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్