మా కూతురు ఆత్మకు శాంతి కలిగింది: నిందితుల ఎన్‌కౌంటర్ పై దిశ ఫ్యామిలీ

By narsimha lode  |  First Published Dec 6, 2019, 9:01 AM IST

దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో మృతి చెందడంపై దిశ ఫ్యామిలీ స్పందించింది. తమ కూతురికి కొంతలోనైనా ఆత్మ శాంతి కల్గిందని భావించారు.


హైదరాబాద్: దిశ ను గ్యాంగ్ రేప్ కు పాల్పడి హత్య చేసిన నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్ లో మృతి చెందడం పట్ల దిశ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఇంత కాలం పాటు అండగా నిలిచినవారందరికీ ఆ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Also read:సజ్జనార్: నాడు వరంగల్‌లో, నేడు షాద్‌నగర్‌లో నిందితుల ఎన్‌కౌంటర్

Latest Videos

undefined

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ చేసిన విషయమై శుక్రవారం నాడు ఉదయం దిశ తల్లిదండ్రులకు తెలిసింది. ఈ విషయమై వారు మీడియాతో మాట్లాడారు.
చనిపోయిన పాప తిరిగిరాదు, కానీ, ఈ ఘటన తమకు ఉపశమనం కలుగుతోందని దిశ తండ్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పాల్పడకుండా ఈ తరహా ఘటనలు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు.

Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

తమ కూతురును కాల్చి చంపిన నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని దిశ తండ్రి అభిప్రాయపడ్డారు. తన బిడ్డ కేసులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల దిశ తండ్రి ధన్యవాదాలు తెలిపారు. 

తన కూతురిని చిత్రహింసలు పెట్టిన విషయాలను తలుచుకొని తమకు నిద్ర పట్టడం లేదని ఆయన చెప్పారు. తమ కూతురిని చిత్రహింసలను పాల్పడడంతో తాము నిద్రమాత్రలు వేసుకొంటున్నామని ఆయన తెలిపారు.

Also read:దిశ రేప్, హత్య కేసు: అర్థరాత్రి నలుగురు నిందితుల కాల్చివేత

తనకు, తన భార్యకు ఆరోగ్యం బాగా లేదని దిశ తండ్రి చెప్పారు.ఈ విషయమై మాట్లాడేందుకు దిశ తల్లి మాత్రం మీడియాతో మాట్లాడలేకపోయింది. దిశను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకొన్నారు. 

తన కూతురుకు మనస్సుకు శాంతి లభించింది, గుండెల్లో భారం తగ్గిందన్నారు. కొద్దిలో కొద్దిలో తన కూతురుకు న్యాయం జరిగిందని అనుకొంటున్నానని ఆమె చెప్పారు. తన కూతురు కొవ్వొత్తిలా కరిగిపోయి దేశానికి స్పూర్తిగా నిలిచిందని చెప్పారు. 

నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల దిశ సోదరి సంతోషం వ్యక్తం చేశారు. తన సోదరి హత్య జరిగిన నుండి ఇప్పటివరకు తమ వెన్నంటి ఉన్న మీడియా, ప్రభుత్వం, ప్రజలకు, ప్రజా సంఘాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఎన్ కౌంటర్ దోహదం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల నిందితులను ఉరి తీస్తారని భావించామని, ఎన్‌కౌంటర్ చేయడంతో దిశ సోదరి ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఇంత త్వరగా న్యాయం జరుగుతోందని భావించలేదన్నారు.

click me!