దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు
గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
undefined
AlsoRead దిశ రేప్, హత్య కేసు: అర్థరాత్రి నలుగురు నిందితుల కాల్చివేత...
దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. సంఘటన స్థలంలోనే కరడుకట్టిన కామాంధులైన ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన సంచలనం రేపింది.
వీరి ఎన్‌కౌంటర్ తో ‘దిశ’కు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు. ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.