దిశ హత్య కేసు... ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి సీపీ సజ్జనార్

By telugu teamFirst Published Dec 6, 2019, 8:32 AM IST
Highlights

షాద్‌నగర్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు.

శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కాగా...  నిందితులను ఎన్ కౌంటర్  జరిగిన ప్రదేశానికి సీపీ సజ్జనర్ చేరుకున్నారు. వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం.

 

షాద్‌నగర్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు. పారిపోతున్న నలుగురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందారు. 

దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని  పెట్రోల్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 3.30కి ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు సమాచారం. పోలీస్‌కస్టడీకి తీసుకున్న రెండో రోజే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. 

click me!