జస్టిస్ ఫర్ దిశ: ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన తృప్తి దేశాయ్ అరెస్ట్

By narsimha lode  |  First Published Dec 4, 2019, 12:27 PM IST

'సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ను బుధవారం నాడు హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన సమయంలో ఆమెను అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్: శంషాబాద్ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో  దిశ కుటుంబానికి న్యాయం చేయాలని  డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్ బుధవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Latest Videos

undefined

శంషాబాద్ కు సమీపంలో గ్యాంగ్‌రేప్‌‌కు హత్యకు గురైంది దిశ.  దిశ హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకొన్నాయి. ఈ తరుణంలో దిశ ఘటన కుటుంబానికి న్యాయం చేయాలని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ డిమాండ్ చేసింది.

Also read:15 రోజుల క్రితమే అమ్మమ్మ: దిశ ఫ్యామిలీపై దెబ్బ మీద దెబ్బ

శంషాబాద్ కు సమీపంలో వారం రోజుల క్రితం యువతిని నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్ చేశారు. ఆ తర్వాత ఆమెను చంపేశారు. నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. 

నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. తమ కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్ పోలీసులు షాద్‌నగర్  కోర్టులో  కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై షాద్‌నగర్ కోర్టు బుధవారం  నాడు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Also read:జస్టిస్ ఫర్ దిశ: వెటర్నరీ డాక్టర్ కావడానికి కారణమిదే

దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు సాగుతున్నాయి. మరో వైపు ఢిల్లీలో స్వాతిమాలివాల్ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరహారదీక్షకు దిగారు.

click me!