సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

First Published Aug 1, 2017, 6:01 PM IST
Highlights
  • జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ
  • వారం లోగా సమస్యలు పరిష్కరించచకపోతే మళ్లీ సమ్మె
  • డ్యూటీ డాక్టర్ సస్పెన్షన్
  • డాక్టర్లపై దాడి జరిగితే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్న డిఎంఇ

జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా  స్పందించడంతో వారు సమ్మె విరమణకు అంగీకరించారు. వారం రోజుల్లోగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అవసరమైతే మళ్లీ సమ్మె చేస్తామని వాళ్లు స్పష్టం చేశారు. ఎస్పీఎఫ్ భద్రత కల్పిస్తామని, ఐసియు, ఎమర్జెన్సీ బ్లాకుల వద్ద సిసి కెమెరాలు, అలారం లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. దానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. డాక్టర్లపై దాడి జరిగిన సమయంలో డ్యూటీ డాక్టర్ మొయిన్ సిద్ధిఖీ పై సస్పెన్షన్ వేటు పడింది. డాక్టర్లపై దాడి జరిగితే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఉస్మానియా సూపరింటెండెంట్ కు డిఎంఇ నోటీసులు జారీ చేసింది. 24 గంటల పాటు సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారం కాకపోతే మళ్లీ సమ్మె చేస్తామన్నారు. వారు సమ్మె విరమించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.

click me!