పుట్టా మధు చాలా మొండివాడు : తుమ్మల

Published : Aug 01, 2017, 05:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
పుట్టా మధు చాలా మొండివాడు : తుమ్మల

సారాంశం

పుట్టా మధు చాలా మొండివాడు పని అయ్యేదాక వదలడు మంథని అభివృద్ధికి సహకరిస్తా  పుట్టా మధుపై తుమ్మల ప్రశంసలు

మంథని ఎమ్మెల్యే పుట్టా మధు మొండివాడు అని ఖితాబిచ్చారు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అనుకున్న పని అయ్యేదాకా పుట్టా మధు వదిలిపెట్టడు అనని అభినందించారు.

రోడ్ల కోసం రాష్ట్ర బడ్జెట్ 6వేల కోట్లు అయితే, ఒక్క కరీంనగర్  జిల్లాలో  2883 కోట్లు ఖర్చు పెట్టించాడు ఈటల రాజేందర్ అని కొనియాడారు.

అందులో ఎక్కువ నిధులు పుట్టా మధు నియోజకవర్గం మంథనిలోనే 283 కోట్లు ఇప్పించుకున్నాడని చెప్పారు తుమ్మల.

పుట్ట మధు చేసే అభివృద్ధి పనులకు సహకరిస్తామని మంత్రి  తుమ్మల పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేది న ఈ బ్రిడ్జి మీద ప్రయనిస్తామని హామీ ఇచ్చారు తుమ్మల.

మనేరునది పై ఖమ్మంపల్లి వద్ద బ్రిడ్జికి రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పుట్టా మధు ఇతర నాయకులు పాల్గొన్నారు.     

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...