పవన్ కు ఆర్ కృష్ణయ్య చురకలు

First Published Aug 1, 2017, 5:35 PM IST
Highlights
  • కాపులను బిసిల్లో చేర్చడం చట్ట విరుద్ధం
  • ఈ విషయం పవన్ కు తెలియదా?
  • నేను ఆనాడే టిడిపి మేనిఫెస్టోను వ్యతిరేకించాను
  • ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు

సినీ స్టార్, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య చరకలు అంటించారు. కాపులను బీసీ లలో కలపడం చట్ట విరుద్ధం అని స్పష్టం చేశారు కృష్ణయ్య. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994 లో కాపులను బీసీలో చేర్చుతూ తెచ్చిన  జీవోను కొట్టేవేయించానని గుర్తు చేశారు. ఈ  విషయం పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నించారు.

తాను తెలంగాణ రాష్ట్రంలో బీసీ సీఎం అభ్యర్థిగా పోటీ చేశానని, ఆనాడే ఏపీ టీడీపీ మేనిఫెస్టో ను వ్యతిరేకించానని చెప్పారు. కాపులను బీసీల్లో ఎలా కలుపుతారు? ఇదేమైనా ధర్మ సత్రమా? ఎవర్ని పడితే వారిని బీసీల జాబితాలో చేర్చడానికి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ దీనిపై ఆలోచించాలన్నారు. పవన్ పేదల గురించి ఎన్నో సినిమాల్లో నటించారని అభినందించారు. పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవుని స్పస్టం చేశారు. కృష్ణయ్య.

click me!