రేప్ చేశాడని లేడీ లాయర్ ఆరోపణ: జడ్జి అరెస్టు

By pratap reddyFirst Published Aug 15, 2018, 11:07 AM IST
Highlights

ప్రేమపేరుతో దళిత యువతిని మోసం చేశాడనే ఆరోపణపై ఓ న్యాయమూర్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న సత్యనారాయణరావును పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. 

హైదరాబాద్: ప్రేమపేరుతో దళిత యువతిని మోసం చేశాడనే ఆరోపణపై ఓ న్యాయమూర్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న సత్యనారాయణరావును పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. 

హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఉంటున్న ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సివిల్‌ కోర్టు మహిళా న్యాయవాది రజిని ఆరోపణలు ఆయన అరెస్టుకు దారి తీశాయి. 

మహిళా న్యాయమూర్తి ఆరోపణల ప్రకారం ... రజని, సత్యనారాయణ రావు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఇటీవల సత్యనారాయణరావు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు.

దానిపై సత్యనారాయణరావును నిలదీయగా అతడితో పాటు ఆయన తల్లి రజినీపై దాడి చేసి కులం పేరుతో దూషించారు. దీంతో ఈ నెల 4న రజని చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో అక్కడి పోలీసులు సత్యనారాయణరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్‌ కేసు నమోదు చేశారు. 

హైకోర్టు అనుమతితో అతడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.  

click me!