హైద్రాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు పేర్కొన్నారు. బాధిత మైనర్ బాలికతో పాటు మరో బాలికను కూడా నిందితులు వేధింపులకు గురి చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారని ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.
హైదరాబాద్: Hyderabad నగరంలోని Jubilee hills gang rape case ఘటనకు సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు పేర్కొన్నారు. మైనర్ బాలికలను ట్రాప్ చేసి ఈ గ్యాంగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా Remand Report లో పోలీసులు పేర్కొన్నారని తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ (NTV) ప్రసారం చేసింది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన బాలికతో పాటు మరో బాలికను కూడా నిందితులు వేధింపులకు పాల్పడినట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారని ఆ ఛానెల్ ప్రసారం చేసింది.
Pub లోనే ఓ Minor బాలికపై వేధింపులకు పాల్పడింది ఈ గ్యాంగ్. ఈ వేధింపులు భరించలేక బాధిత బాలిక పబ్ నుండి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న బాధిత మైనర్ బాలికను కూడా ఈ గ్యాంగ్ సభ్యులు నమ్మించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సంతోషం చూపిస్తామని కూడా బాలికకు చెప్పారని ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని ఆ ఛానెల్ ప్రసారం చేసింది.
undefined
బాధిత బాలికను ఇంటి వద్ద దింపుతామని రెడ్ కలర్ బెంజీ కారులో నిందితులు తీసుకెళ్లారు. బెంజీ కారులోనే బాలికపై వేధింపులకు పాల్పడ్డారు. పబ్ నుండి కాన్సూ బేకరీ వద్దకు బెంజీ కారులో వెళ్లిన ఈ గ్యాంగ్ ను వెనుకాలే ఇన్నోవా కారులో కార్పోరేటర్ కొడుకు ఫాలో అయినట్టుగా ఎన్టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. బెంజీ కారులో పెట్రోల్ అయిపోయిందని నమ్మించి ఇన్నోవా కారులోకి మైనర్ బాలికను ఎక్కించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారని ఆ ఛానెల్ ప్రసారం చేసింది.
పదే పదే ఫోన్లు రావడంతో ఎమ్మెల్యే కొడుకు బేకరి నుండి వెళ్లిపోయారని ఆ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారని ఆ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. ఇన్నోవా కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారని ఆ న్యూస్ ఛానెల్ కథనం తెలిపింది.
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత పబ్ వద్ద బాలికను దించేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఎంజాయ్ చేశామని ఇన్‌స్టాగ్రామ్ లో గ్రూప్ పోటోను షేర్ చేశారని రిమాండ్ రిపోర్టు తెలిపిందని న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితుల్లో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
నలుగురిలో ఒకరు మేజర్ కాగా, మిగిలినవారు మైనర్లేనని పోలీసులు తెలిపారు. బెంజీకారుతో పాటు ఇన్నోవా కారులో కూడా పోలీసులు ఆధారాలను సేకరించారు. నిందితుల్లో ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ను సేకరిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన వాహనాలతో పాటు ఫోన్ డేటాను కూడా సేకరించనున్నారు.