హైద్రాబాద్ ఫిలింనగర్‌లో దారుణం: వివాహిత కిడ్నాప్‌‌నకు యత్నం, అడ్డుకున్న భర్త హత్య

Published : Jan 17, 2024, 02:23 PM IST
హైద్రాబాద్ ఫిలింనగర్‌లో దారుణం: వివాహిత కిడ్నాప్‌‌నకు యత్నం, అడ్డుకున్న భర్త హత్య

సారాంశం

హైద్రాబాద్ ఫిలింనగర్ లో  దారుణం చోటు చేసుకుంది.  వివాహిత భర్తపై  ఓ వ్యక్తి దాడి చేయడంతో అతను మృతి చెందాడు.

హైదరాబాద్: నగరంలోని ఫిలింనగర్ లో  ప్రేమోన్మాది  దారుణానికి పాల్పడ్డాడు.  వివాహిత భర్తను దారుణంగా హత్య చేశాడు. ఫిలింనగర్ లో  వివాహిత భర్తతో కలిసి నివసిస్తుంది.  వివాహిత  లండన్ లో చదువుకునే సమయంలో  ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో వివాహం చేసుకోవాలని  యువతిని   వేధించాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.

అయితే  చదువు పూర్తైన తర్వాత వేరే యువకుడితో యువతికి వివాహం జరిగింది.అయితే  వివాహం జరిగినా కూడ తనతో రావాలని యువతిని  ఆ యువకుడు వేధించాడని బాధితురాలు ఆరోపిస్తుంది.అయితే తాను  రాలేనని ఆ యువతి తెగేసి చెప్పినట్టుగా బాధితురాలు చెబుతున్నారు.

బుధవారంనాడు ఉదయం యువతి ఇంటికి వచ్చిన యువకుడు  ఆమెను కిడ్నాప్ చేసేందుకు ఆ యువకుడు యత్నించాడని  బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో యువతి భర్త అడ్డుకున్నాడు. యువతి భర్తపై ఆ యువకుడు దాడికి దిగాడని బాధితులు చెబుతున్నారు.ఈ దాడిలో యువతి భర్త తీవ్రంగా గాయపడి మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడితో పాటు అతడికి సహకరించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలంగాణ గవర్నర్ కి థ్యాంక్స్ చెప్పిన స్విగ్గి, జొమాటో బాయ్స్.. ఎందుకో తెలుసా?
Advocate Allam Nagaraju Sensational Comments : బండి భగీరథ్ పై కేసు నిలవదు ?? | Asianet News Telugu