కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారన్న సంజయ్ ... హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

By Arun Kumar P  |  First Published Jan 17, 2024, 1:58 PM IST

 బిఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో నాగర్ కర్నూల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బిజెపి ఎంపి బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. 


హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడన్న బిజెపి ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్-బిజెపి లు కలిసి బిఆర్ఎస్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని... అందుకు నిదర్శనమే బండి సంజయ్ వ్యాఖ్యలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు బిజెపి సిద్దంగా వుందన్న సంజయ్ వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మైత్రిని బహిర్గతం చేసిందన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణ కోసం బిజెపి నాయకుల మెడలు వంచుతామని చెప్పి ఇప్పుడు వారికే దండలు వేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడాయని హరీష్ ఆరోపించారు. 

బుధవారం బిఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో నాగర్ కర్నూల్ లోక్ సభ సన్నహక సమావేశం జరిగింది. ఇందులో హరీష్ రావు పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బ్రహ్మజ్ఞాని సంజయ్ సెలవిచ్చాడని ఎద్దేవా చేసారు. ఇది పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లుగా వుందన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు... ఈ బ్రోకర్లు తమ గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బిజెపిది ... అలాంటి పార్టీ నాయకుడు తాము ప్రభుత్వాన్ని కూల్చుతామంటే ఎవరూ నమ్మబోరని హరీష్ అన్నారు. 

Latest Videos

Also Read  బీజేపీని వీడనున్న ఈటల రాజేందర్..? కాంగ్రెస్ లో చేరి బండి సంజయ్ పైనే పోటీ..!

కరీంనగర్ కు ఒక్క రూపాయి తెనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడువు మాట్లాడుతున్నాడంటూ సంజయ్ పై హరీష్ సీరియస్ అయ్యారు. బిఆర్ఎస్ పార్టీపై, అధినేత కేసీఆర్ పై ఎంత దుష్ఫ్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠమని... రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి తప్పులు చేయబోమని అన్నారు. పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఎంపీలు వుండాల్సిన అవసరం వుందని ... తెలంగాణ రాష్ట్రంకోసం కేంద్రంతో పోరాడేది తమ ఎంపీలేనని హరీష్ అన్నారు.

 

click me!