మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) బీజేపీ (BJP)ని వీడబోతున్నారని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనకు ఇప్పటికే కాంగ్రెస్ (Congress) కరీంనగర్ ఎంపీ టిక్కెట్ (karimnagar mp ticket) ఆఫర్ చేసిందని తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ ఆ పార్టీలో చేరబోతున్నారని సమాచారం.
Etela rajender : హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీని వీడనున్నారా ? కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా ? కరీంగనర్ నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారా ? ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తే వీటికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈటల బీజేపీతో అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీని వీడుతారయని చాలా కాలంగా ఊహాగాలను వినిపిస్తున్నా.. ఆయన వాటిని కొట్టిపారేశారు. కానీ లోక్ సభ ఎన్నికలకు ముందు ఈటల రాజేందర్ తన స్టాండ్ ను మార్చుకున్నారని తెలుస్తోంది.
ఇట్ల కూడా రోడ్లు వేస్తరా..? ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. వైరల్..
undefined
ఇటీవల తెలంగాణ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున గజ్వేల్, హుజూరాబాద్ స్థానాల నుంచి పోటీ చేశారు. కానీ రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఆయన మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే కొంత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈటలకు కరీంనగర్ లోక్ సభ టికెట్ ఆఫర్ చేసిందని ‘తెలంగాణ టుడే’ కథనం పేర్కొంది. గత కొంత కాలంగా ఇరువురి నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. కాబట్టి ఈ స్థానం నుంచి ఈటల వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు పోటీ చేస్తే సులువుగా విజయం సాధించవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈటల, బండి మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది.
ఎమ్మెల్సీ అభ్యర్థులకు జగ్గారెడ్డి సంతకంతో బీఫారాలు .... కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం
గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఇరువురు నేతలను హెచ్చరించి, వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారని టాక్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండిని తొలగించినప్పటి నుంచి ఆయన ఈటలను టార్గెట్ చేస్తూ సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు వచ్చినా ఆయన అదే పార్టీలో కొనసాగారు. ఆ పార్టీ తరఫునే హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా ఓడిపోయారు. అయితే, ఈసారి ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. మల్కాజిగిరి లోక్ సభ స్థానం కోసం ఈటల ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే ఆయన తన ప్రణాళికను పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పారని కూడా వార్తలు వచ్చాయి.
C4IR: తెలంగాణకు అరుదైన అవకాశం.. హైదరాబాద్లో సీ4ఐఆర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..
అయితే తాను బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, తాను పార్టీలోనే కొనసాగుతానని ఈటల ఇటీవల మీడియా ప్రతినిధులతో అన్నారు. కానీ తమ నేత బీజేపీలో సంతృప్తిగా లేరని, త్వరలోనే పార్టీని వీడే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. మరి ఆయన బీజేపీలోనే కొనసాగుతారా ? లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.