తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident in Tamil nadu) తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు మరణించారు (3 Telangana Ayyappa devotees dead). ములుగు జిల్లా (mulugu district) కు చెందిన ఈ భక్తులు శబరిమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
tamilnadu road accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు మరణించారు. మద్రాస్ బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు ఓ కారులో కేరళలోని శబరిమలకు వెళ్లారు. అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం అదే కారులో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆ వాహనం ఆదివారం మధ్యాహ్నం సమయంలో తమిళనాడులోని మద్రాస్ బైపాస్ రోడ్డుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది.
మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..
ఈ ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు అక్కడికక్కడే మరణించారు. వీరిని సుబ్బయ్య నాయుడు, నరసాంబయ్య, రాజుగా గుర్తించారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందగానే తమిళనాడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. అలాగే మృతదేహాలను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనతో కమలాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.