జవహర్ నగర్ బాలిక మృతి కేసులో వీడని మిస్టరీ... పోలీసుల చేతికి ఫోరెన్సిక్ రిపోర్ట్

By Siva Kodati  |  First Published Dec 18, 2022, 4:40 PM IST

జవహర్ నగర్ బాలిక మృతి కేసులో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్, స్మార్ట్‌ఫోన్ ఇంకోకటి, కీ పాడ్ ఫోన్ మరొక దానిని వెరిఫై చేశారు పోలీసులు. అలాగే ఫోరెన్సిక్ టీం నివేదిక పోలీసులకు చేరింది.


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ బాలిక మృతి కేసులో సస్పెన్స్‌ కొనసాగుతోంది. గాంధీ ఫోరెన్సిక్ టీం పోస్ట్‌మార్టం నివేదిక పోలీసుల చేతికి చేరింది. చిన్నారి మిస్సయిన మరుసటి రోజే నీటిలో పడినట్లుగా రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యింది. స్కూల్ నుంచి అదృశ్యమైన బాలిక డే అండ్ నైట్ ఎక్కడికి వెళ్లింది అనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే పలు గంజాయి బ్యాచ్‌లను ప్రశ్నించారు పోలీసులు. బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్, స్మార్ట్‌ఫోన్ ఇంకోకటి, కీ పాడ్ ఫోన్ మరొక దానిని వెరిఫై చేశారు పోలీసులు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను విచారించారు. 

అసలేం జరిగిందంటే.. 

Latest Videos

undefined


గురువారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఇందును, ఆమె ఇద్దరు సోదరీమణులను వారి తండ్రి జె నరేష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వదిలిపెట్టిన వెంటనే బాలిక కనిపించకుండా పోయింది. ఇందు చివరిసారిగా ఆమె స్నేహితులకు కనిపించిందని పోలీసులు తెలిపారు. అయితే ఇందు పాఠశాలలో కనిపించకపోవడం.. బ్యాగ్ మాత్రం ఉండటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టుగా ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. దీంతో స్కూల్ సిబ్బంది, ఇందు తల్లిదండ్రులు.. ఆమె ఆచూకీ కోసం వెతికారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇందు కోసం గాలింపు చేపట్టారు. 

Also Read:విషాదంగా ముగిసిన ఇందు మిస్సింగ్: హైద్రాబాద్ దమ్మాయిగూడ చెరువులో విద్యార్ధిని డెడ్‌బాడీ లభ్యం

ఇందు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఇందు స్కూల్ నుంచి బయటకు వెళ్లే సమయంలో సమీపంలోని పార్క్‌లో ఆడటానికి వస్తారా అని స్నేహితులను అడిగిందని.. అయితే ఉపాధ్యాయులు ఏమైనా అంటారేమోనన్న భయంతో వారు అందుకు నిరాకరించరని పాఠశాలకు చెందిన ఓ టీచర్ చెప్పారు. ఇందు చదువుతున్న స్కూల్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ‌ని పోలీసులు పరిశీలించారు. పాఠశాల నుంచి మసీదు మీదుగా దమ్మాయిగూడ చెరువు వైపు ఇందు ఒంటరిగా వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ పోలీసులు గాలింపు చేపట్టారు. బాలిక జాడను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను తీసుకొచ్చిన లాభం లేకుండా పోయింది. అయితే శుక్రవారం ఇందు దమ్మాయిగూడ చెరువులో ఇందు మృతదేహం తేలియాడుతూ కనిపించింది. అయితే సాధారణంగా తాగుబోతుల సంచరించే ప్రాంతంలోని చెరువులో చిన్నారి శవమై కనిపించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెరువు దగ్గర ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో.. పోలీసుల ఇతర మార్గాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

చిన్నారి ఇందు మృతితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను దారి తీసింది. ఇందు మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇందు కోసం వెతుకులాటలో పోలీసులు ఆలస్యం చేశారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గురువారం  రోజున పోలీసులు నీటిలో వెతకలేదని.. వారు కేవలం సీసీటీవీ ఫుటేజ్‌పై మాత్రమే దృష్టి పెట్టారని ఆరోపించారు. మృతదేహం నీటిపై తేలిన తర్వాతే పోలీసులు ఆమెను కనుగొన్నారని చెప్పారు. ఇక, ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించిన తరువాత పోలీసులు ఇందు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

click me!