కూతురు ఆరోపణలు.. కన్నీటిపర్యంతమైన ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే...

By SumaBala Bukka  |  First Published May 9, 2023, 1:40 PM IST

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన కూతుర్ని ప్రత్యర్థులు ఉసి గొలుపుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ గొడవను రాజకీయం చేస్తున్నారన్నారు. 
 


జనగామ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఆయన కూతురు భూఆక్రమణ, ఫోర్జరీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉప్పల్ పోలీసులకు తండ్రి మీద ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఇదంతా ప్రత్యర్థులు ఆడిస్తున్న నాటకం అని ముత్తిరెడ్డి కొట్టిపారేశారు. దీనిమీద ఆయన స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రత్యర్థులు తమ కుటుంబంలో చిచ్చులు పెట్టాలని చూస్తున్నారని.. చిన్నవిషయాన్ని రాజకీయం చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు తెలియకుండా భూములను లీజుకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఫోర్జరీ అంటే ఆస్తులు ఒకరి పేరు మీదినుంచి మరొకరి పేరు మీదికి మారాలి. కానీ అలా ఏమి మారలేదు అన్నారు. కేవలం లీజుకు తీసుకున్న వ్యక్తి మాత్రమే మారాడన్నారు. 

Latest Videos

undefined

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కూతురు సంచలన ఆరోపణలు, భూ ఆక్రమణ, ఫోర్జరీలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు...

చేర్యాలలో సర్వే నెంబర్ 1402లో 1200 గజాల స్థలం తన కూతురు తుల్జా భవాని రెడ్డి పేరుమీద రిజిస్టర్ అయి ఉందని.. ఇందులో ఎలాంటి ఫోర్జరీ లేదన్నారు. దీంతోపాటు హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో కూడా తన కూతురు పేరు మీద 125 నుంచి 150 గజాల స్థలం ఉందని.. అందులోనూ ఫోర్జరీ లేదన్నారు. కిరాయి నామా దస్తావేజులను తన కుమారుడు మార్చాడని.. అది తనకు తెలియకుండా చేశాడని చెప్పుకొచ్చారు.  

ప్రత్యర్థులు తమ బిడ్డను ఉసిగొలిపి తనమీద కేసు వేయించారని..  ఇది  తమ కుటుంబ గొడవ అని.. దాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పకొచ్చారు. కూతురు చేసిన ఆరోపణలు నిజం కాదని అన్నారు.  అది ఎవరు చేస్తున్నారో కూడా అధిష్టానానికి తెలుసునని.. తాను దానిమీద ఏమి మాట్లాడబోనని చెప్పుకొచ్చారు. నెమ్మదిగా అన్నీ క్లియర్ అవుతాయని అన్నారు. 

ఇదిలా ఉండగా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి..  సిద్దిపేట జిల్లా చేర్యాలలో తనకు సంబంధించిన ఎకరం 20 గుంటల భూమిని.. తన తండ్రి ఆక్రమించాడని ఆరోపిస్తోంది. తండ్రి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని తీసుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు ముత్తిరెడ్డిపై ఇదే విషయాన్ని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు కూడా చేసింది. ఈ ఫిర్యాదును పోలీసులు తీసుకున్నారు. సెక్షన్ 406, 420, 463,464,468, 471, ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్‌పీసీ ల ప్రకారం ముత్తిరెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి.

click me!