జీరో షాడో డే: హైద్రాబాద్‌లో మాయమైన నీడ

By narsimha lode  |  First Published May 9, 2023, 1:02 PM IST

హైద్రాబాద్  నగరంలో  ఇవాళ   మధ్చాహ్నం కొన్ని క్షణాల పాటు  నీడ కన్పించలేదు.    జీరో షాడో ను  చూసేందుకు  ప్రజలు  ప్రయత్నించారు.  


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో   మంగళవారంనాడు మధ్యాహ్నం   నీడ  కన్పించలేదు.. ఇవాళ మధ్యాహ్నం  12:12 గంటలకు  నీడ  జాడ మాయమైంది.   ఈ సమయంలో  నీడ లేకుండా ఎలా ఉందో  చూసేందుకు  ప్రజలు  ప్రయత్నించారు. జీరో షాడోను ప్రజలు తిలకించేందుకు గాను  బిర్లా ప్లానిటోరియం పెద్ద ఎత్తున ఏర్పాట్లు  చేసిన  విషయం తెలిసిందే.

 ఏదైనా వస్తువుపై  సూర్యకిరణాలు పడితే  నీడ కన్పిస్తుంది.  అయితే  ఇవాళ  మధ్యాహ్నం 12:12 గంటలకు మాత్రం  నీడ కన్పించకుండా  పోయింది. అయితే  ప్రతి ఏడాది  రెండు  రోజుల పాటు  నీడ లేని రోజులు కన్పిస్తుంటాయి. ఈ ఏడాది మే 9వ తేదీన ఆగస్టు  3వ తేదీల్లో  జీరో షాడో కన్పించనుంది. 

Latest Videos

భూమి, సూర్యుడి మధ్య  రేఖను  సౌరక్షీణత రేఖగా  పిలుస్తారు. ఈ సౌరక్షీణత  సూర్యకిరణాలు  పడే అక్షాంశానికి   సమానమైనప్పుడు  జీరో షాడో ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే  ఈ ఏడాది ఏప్రిల్ 25న జీరో షాడో  డే  కన్పించింది. 

click me!