ఉగ్ర మూలాలపై మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసుల ఆపరేషన్: హైద్రాబాద్‌‌లో 16 మంది అరెస్ట్

By narsimha lode  |  First Published May 9, 2023, 12:08 PM IST


మధ్యప్రదేశ్,  తెలంగాణ పోలీసులు  జాయింట్ ఆపరేషన్ లో  16 మందిని  పోలీసులు అరెస్ట్  చేశారు.వీరి నుండి  మొబైల్స్,  ఇస్లామిక్ జిహాదీ సాహిత్యం  సీజ్  చేశారు.  
 



హైదరాబాద్:  మధ్యప్రదేశ్ కు  చెందిన  ఏటీఎస్, హైద్రాబాద్  పోలీసులు   మంగళవారంనాడు  జాయింట్  ఆపరేషన్ నిర్వహించారు. హైద్రాబాద్ లో  16 మందిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. అరెస్టైన వారిలో  11 మంది  మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు మిగిలిన ఐదుగురు  హైద్రాబాద్ కు  చెందినవారు. మొత్తం  16 మందిని  మధ్యప్రదేశ్ కు తీసుకెళ్లింది  ఏటీఎస్ టీమ్.

హైదరాబాద్:  మధ్యప్రదేశ్ కు  చెందిన  ఏటీఎస్, హైద్రాబాద్  పోలీసులు   మంగళవారంనాడు  జాయింట్  ఆపరేషన్ నిర్వహించారు. హైద్రాబాద్ లో  16 మందిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. అరెస్టైన వారిలో  11 మంది  మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు మిగిలిన ఐదుగురు  హైద్రాబాద్ కు  చెందినవారు. మొత్తం  16 మందిని  మధ్యప్రదేశ్ కు తీసుకెళ్లింది  ఏటీఎస్ టీమ్.

Latest Videos

హైద్రాబాద్ లో యువతను ఉగ్రవాదం వైపునకు  మళ్లించేందుకు  ప్రయత్నిస్తున్నారని  కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారం  మేరకు  మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 

హైద్రాబాద్ నగరంలో  సుమారు  18 మాసాలుగా  ఉంటూ  ఉగ్ర కార్యకలాపాలకు  పాల్పడుతున్నారనే  అనుమానంతో  16 మందిని  పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితుల నుండి  ఇస్లామిక్  జిహదీ  సాహిత్యం,  డ్రాగర్స్, ఎలక్ట్రానిక్ డివైజ్ లు  , మొబైల్స్ ను   పోలీసులు సీజ్  చేశారు. 

18 నెలలుగా  వీరంతా  హైద్రాబాద్ లో ఏం చేశారని  పోలీసులు  విచారిస్తున్నారు.  హైద్రాబాద్ లో ఏమైనా  కార్యక్రమాలకు ప్లాన్  చేశారా  ఇతరత్రా విషయాలపై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

దేశ వ్యాప్తంగా   ఉగ్ర కార్యకలాపాలు  జరిగితే  హైద్రాబాద్ తో లింకులుండేవి. అయితే హైద్రాబాద్ లో ఉగ్రమూలాలపై  పోలీసులు  కేంద్రీకరించారు. దరిమిలా ఉగ్ర కార్యకలాపాలు  తగ్గుముఖం పట్టినట్టుగా  పోలీసులు అధికారులు చెబుతున్నారు. అయితే  తాజాగా  కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో  మధ్యప్రదేశ్ ఏటీఎస్ , తెలంగాణ  పోలీసులు  జాయింట్  ఆపరేషన్ లో  16 మంది  అరెస్టు కావడం  కలకలం రేపుతుంది. ఈ 16 మంది  ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, ఎక్కడెక్కడకు తిరిగారు, వీరికి  ఆర్ధికంగా సహకరించిన వారెవరనే విషయమై  దర్యాప్తు సంస్థలు  విచారిస్తున్నాయి. 

గత కొంతకాలంగా  వీరిపై  ఇంటలిజెన్స్ నిఘాను  ఏర్పాటు  చేసింది.  హైద్రాబాద్ కు చెందిన  ఐడుగురితో  మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  11 మందితో  ఎలా పరిచయం  ఏర్పడిందనే విషయమై  కూడా  పోలీసులు ఆరా తీస్తున్నారు.  అంతేకాదు  నిందితుల  ఫోన్ల డేటాను కూడా  పోలీసులు పరిశీలిస్తున్నారు.  రాష్ట్రానికి చెందిన  పోలీసులు కూడా   మధ్యప్రదేశ్ పోలీసులకు కొంత సమాచారం ఇచ్చారు. 

click me!