వాళ్ల అభ్యర్థిని గెలిపించుకోవడానికే.. నన్ను అరెస్ట్ చేశారు: జగ్గారెడ్డి

By sivanagaprasad KodatiFirst Published 11, Sep 2018, 9:05 AM IST
Highlights

మనుషుల అక్రమ రవాణాతో పాటు నకిలీ పాస్‌పోర్ట్ కలిగి  ఉన్నానంటూ తనపై వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఖండించారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు. 

తాను ఎవరిని విదేశాలకు తరలించలేదని.. రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఎన్నికల సమయంలో ఈ కేసు పెట్టారని ఆయన అన్నారు... సిద్ధిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకే తనను అరెస్ట్ చేశారని విమర్శించారు. కేసీఆర్, హరీశ్ రావుపై కూడా నకిలీ పాస్‌పోర్ట్ కేసులు ఉన్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు.

అంతకు ముందు సిద్ధిపేట నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన అనంతరం జగ్గారెడ్డికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు

తప్పించుకునేందుకు జగ్గారెడ్డి ఎత్తు: సంగారెడ్డి బంద్ కు పిలుపు

మాకు పాస్‌పోర్టులే లేవు: జగ్గారెడ్డి భార్య నిర్మల

Last Updated 19, Sep 2018, 9:22 AM IST