జగ్గారెడ్డి అరెస్టు: మనుషుల అక్రమ రవాణా కథా కమామిషు

By pratap reddyFirst Published Sep 11, 2018, 9:03 AM IST
Highlights

మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెసు నేత జగ్గారెడ్డి అరెస్టు కావడంతో దీని డొంక ఎలా కదిలిందనేది ఆసక్తికరంగా మారింది. మనుషుల అక్రమ రవాణా కేసులో 2007లో ఢిల్లీ పోలీసులు బాబూభాయ్‌ ఖటారా అనే ఎంపీని అరెస్టు చేశారు.

హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెసు నేత జగ్గారెడ్డి అరెస్టు కావడంతో దీని డొంక ఎలా కదిలిందనేది ఆసక్తికరంగా మారింది. మనుషుల అక్రమ రవాణా కేసులో 2007లో ఢిల్లీ పోలీసులు బాబూభాయ్‌ ఖటారా అనే ఎంపీని అరెస్టు చేశారు. ఈ అరెస్టుతోనే దేశంలో తొలిసారిగా మనుషుల అక్రమ రవాణా అనేది వెలుగు చూసింది.

కొన్ని కారణాలతో గుజరాతీయులకు అప్పట్లో అమెరికా వీసాలను నిలిపివేసింది. విజిట్‌ సహా వివిధ రకాల వీసాలపై తమ దేశం వచ్చే గుజరాతీయులు అక్రమంగా స్థిరపడిపోతున్నారని ఆరోపిస్తూ అమెరికా ఆ నిర్ణయం తీసుకుంది. 

దీంతో గతంలో గుజరాతీయుల అక్రమ రవాణాకు దేశంలో పునాది పడి ఆ తర్వాత ఊపందుకుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ముఠాలుగా ఏర్పడిన దళారులు రాజకీయ నాయకులను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. వారికి డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టులు సహా మరికొన్ని సదుపాయాలు ఉండటంతో డబ్బు ఆశపెట్టి పలువురు ప్రజాప్రతినిధులను తమ దారిలోకి తెచ్చుకున్నారు. 

గుజరాతీయులను ఆయా రాజకీయ నాయకుల భార్య, పిల్లలుగా చూపిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి పాస్‌పోర్టులు పొందేవారు. ఈ పాస్‌పోర్టుల ఆధారంగా తమ లెటర్‌హెడ్లను వినియోగించి వీసా కోసం ఆయా కాన్సులేట్లకు లేఖలు రాసే వారు. వాటి ఆధారంగా గుజరాతీయులకు అమెరికా వీసాలు లభించేవి. 

ఆ రకంగా గుజరాతీయులను తమతోపాటు తీసుకెళ్లి అమెరికాలో వదిలిపెట్టి తిరిగి వచ్చేవారు. 2007లో ఎంపీ బాబూభాయ్‌ కటారా అరెస్టు తరవాత దానికి కొనసాగింపుగా హైదరాబాద్‌లోనూ కొన్ని అరెస్టులు జరిగాయి.

జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణాకు పాల్పడిన సమయంలోనే మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, కాసిపేట లింగయ్యలపై అదే రకమైన కేసులు నమోదయ్యాయి. అప్పట్లో గుజరాత్‌కు చెందిన మహిళలను అమెరికాకు తరలించినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి

click me!