పంజాగుట్టలో అగ్నిప్రమాదం.. లాడ్జీలో చిక్కుకున్న జనం..కాపాడిన పోలీసులు(వీడియో)

By sivanagaprasad KodatiFirst Published 11, Sep 2018, 8:28 AM IST
Highlights

హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ మద్యం దుకాణంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మోడల్ హౌస్ కాంప్లెక్స్‌కు సమీపంలో ఉన్న ఓ వైన్ షాపులో మంటలు చెలరేగాయి..

హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ మద్యం దుకాణంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మోడల్ హౌస్ కాంప్లెక్స్‌కు సమీపంలో ఉన్న ఓ వైన్ షాపులో మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదంలో మద్యం దుకాణం పూర్తిగా దగ్ధమైంది. వైన్‌షాపు పైన లాడ్జీ ఉండటంతో అందులో నిద్రిస్తున్న  వారు పొగ, మంటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో పాటు లాడ్జీలో ఉన్నవారిని రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.

పోలీసులు కాస్తంత ఆలస్యంగా స్పందించి   ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని స్ధానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం కారంగా రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.

"

Last Updated 19, Sep 2018, 9:22 AM IST