24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

By sivanagaprasad kodatiFirst Published Sep 28, 2018, 7:35 AM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల నుంచి ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన సోదాలు ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల నుంచి ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన సోదాలు ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇప్పటి వరకు రూ.కోటిన్నర నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన కొన్ని ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పన్నుల చెల్లింపులు, ఆదాయ వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే ఈ దాడులు చేస్తున్నట్లుగా సమాచారం.

మరోవైపు కొడంగల్ నుంచి హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డిని ఐటీ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సుమారు 10 గంటల నుంచి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, సన్నిహితులు సెబాస్టియన్, ఉదయ్ సింహా నివాసాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ఐదు రోజుల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా పేర్కొన్నారు.
 

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

click me!