రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల గురించి కవిత ఏమన్నారంటే (వీడియో)

Published : Sep 27, 2018, 09:17 PM IST
రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల గురించి కవిత ఏమన్నారంటే (వీడియో)

సారాంశం

కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై ఇవాళ ఉదయం నుండి ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఇంళ్లపైనే కాకుండా బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ ఒక్కటై రాజకీయ కక్షలో భాగంగా తనపై ఈ దాడులు చేయిస్తున్నట్లు స్వయంగా రేవంత్ ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలపై నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపి, కేసీఆర్ కూతురు కవిత స్పందించారు. కేంద్ర సంస్థల దాడికి తమ పార్టీకి సంబంధం అంటగట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానితో కాని, బిజెపితో కానీ తమకు ఎలాంటి ఒప్పందం లేదని...ఉంటే వారు తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేసేవారు కదా? అని కవిత ప్రశ్నించారు. కాబట్టి ఈ ఆరోపణలు అసత్యమని కవిత కొట్టిపారేశారు.    

వీడియో

"

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu