Hyderabad: ఈ ఏడాది చివరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు గెలుపు ధీమాతో ఉన్నాయి. మరోసారి రాష్ట్రంలో తిరుగులేని విజయంతో మూడో సారి అధికార పీఠం దక్కించుకుంటామని బీఆర్ఎస్ ధీమాతో ఉండగా, కాంగ్రెస్,బీజేపీలు సైతం విజయం తమదేనంటూ పేర్కొంటున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్)కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదే కాబోయే సీఎం.. !
Telangana IT Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు గెలుపు ధీమాతో ఉన్నాయి. మరోసారి రాష్ట్రంలో తిరుగులేని విజయంతో మూడో సారి అధికార పీఠం దక్కించుకుంటామని బీఆర్ఎస్ ధీమాతో ఉండగా, కాంగ్రెస్,బీజేపీలు సైతం విజయం తమదేనంటూ పేర్కొంటున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్)కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదే కాబోయే సీఎం.. !
పురపాలక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్న తన కుమారుడు కేటీఆర్ రాజకీయ హోదాను మరింత పెంచాలని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను పరిగణనలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఈ టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పెరుగుతున్న ఆసక్తి, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన, ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ కావడం ఆయన కుమారుడి రాజకీయ ప్రతిష్టను పెంచే ప్రయత్నాలుగా రాజకీయా వర్గాలు పేర్కొంటున్నాయి.
కేసీఆర్ తన కుమారుడికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల పగ్గాలు అప్పగిస్తారనీ, ఆ తర్వాత ప్రభుత్వ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారనే ఊహాగానాలు గతంలోనూ వినిపించాయి. అయితే, ఈ ఊహాగానాలు కార్యరూపం దాల్చలేదు. అయితే, మళ్లీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే అంశం హాట్ టాపిక్ కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితిగా మార్చడం, మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బాధ్యతలను ఆయన తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించే అవకాశం ఉందని తాజా ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర వ్యవహారాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా, ముఖ్యంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో కేటీఆర్ జోక్యం చేసుకోవడం, అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం వంటి అంశాలు ఆయనకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కేటీఆర్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ లో సీఎం అభ్యర్థిగా వినిపించే పేర్లతో ముందువరుసలో కేటీఆర్ ఉన్నారని చెప్పవచ్చు.
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ పార్టీలో అంతర్గత కుమ్ములాటల ఆందోళనల కారణంగా ముఖ్యమంత్రి ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదని టాక్. అయితే కేటీఆర్ కనుసన్నల్లోనే బీఆర్ఎస్ అధినేత రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు గుర్తించినట్టు సమాచారం. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతున్న కొద్దీ బీఆర్ఎస్ లోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ కేటీఆర్ భవిష్యత్ రాజకీయ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏదేమైనా రానున్న అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ నాయకుల భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలుగా ఉంటాయనేది సుస్పష్టం.. !