హైద్రాబాద్ నగరంలోని అత్తాపూర్ లో ఆదివారంనాడు ఖలీల్ అనే వ్యక్తిని హత్య చేశారు దుండగులు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ లో ఆదివారం నాడు తెల్లవారుజామున ఖలీల్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.పాతకక్షల నేపథ్యంలోనే ఖలీల్ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.హైద్రాబాద్ లోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ కు ఖలీల్ మధ్య కొంత కాలంగా గొడవలున్నాయి. ఈ గొడవల కారణంగానే ఖలీల్ ను ఉస్మాన్ హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఖలీల్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నపాటి గొడవలకే హత్యలు జరుగుతున్న కేసులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదౌతున్నాయి. కరీంనగర్ లో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్న సరిత హత్య కు గురైంది. ఈ నెల 1వ తేదీన ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలో సోషల్ మీడియాలో మేసేజ్ కత్తిపోట్లకు కారణమైంది. తన ప్రియురాలికి మరో వ్యక్తి మేసేజ్ పంపడంతో ప్రియుడు మరో వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్ పురి లో రూ. 10 కోసం ఓ దుకాణ యజమాని హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఈ ఏడాది జూన్ 12న జరిగింది.
ఈ ఏడాది జూన్ 29వ తేదీన సూర్యాపేట పట్టణ కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తిపై దుండగులు కత్తితో దాడికి దిగారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని పోలీసులు గుర్తించారు.
కర్ణాటకలో మరో కులానికి చెందిన యువకుడిని ప్రేమించినందుకుగాను కూతురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు తండ్రి. తన కూతురు ఆత్మహత్య చేసుకొందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రియురాలు మరణించిన విషయం తెలుసుకున్న ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.శ్రీకాకుళం జిల్లా కుప్పిలిలో కన్న కొడుకును అత్యంత దారుణంగా హత్య చేశాడు తండ్రి. ఈ ఘటన ఈ ఏడాది జూన్ 28న జరిగింది