జగన్‌కు హిమాన్ష్ కరచాలనం, కేసీఆర్ కాళ్లుమొక్కిన విజయసాయి

By narsimha lodeFirst Published Jan 13, 2020, 5:57 PM IST
Highlights

రెండు రాష్ట్రాల సీఎంల సమావేశాల్లో సోమవారం నాడు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొన్నాయి. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్య జరిగిన సమావేశం సందర్భంగా ప్రగతి భవన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొన్నాయి. మూడు మాసాల మధ్య ఇద్దరు సీఎంలు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.

Also read:సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ముందుగా పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకొన్నాయి.

Also read:హరీష్, కవితలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇవీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రగతి భవన్ కు చేరుకోగానే తెలంగాణ సీఎం కేసీఆర్  జగన్ కు స్వాగతం పలికారు. సాదరంగా  ప్రగతి భవన్‌లోకి తీసుకెళ్లారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ లు జగన్‌ను కలిశారు. 

also read:తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్: మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ 

ఈ సమయంలో ఎంపీ సంతోష్  కేటీఆర్ జగన్‌లతో కలిసి సెల్పీ దిగారు. ఆ తర్వాత కొద్దిసేపు ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు సీఎంలు కలిసి లంచ్ చేశారు. లంచ్ తర్వాత సమావేశం హల్‌లోకి ఎంపీ సంతోష్ తో కలిసి  జగన్ వెళ్తున్న సమయంలో  కేటీఆర్ కొడుకు హిమాన్ష్ ఏపీ సీఎం జగన్ ను చూసి నమస్కరించారు.దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడ ప్రతి నమస్కారం చేశారు. వెంటనే హిమాన్ష్ జగన్ కు షేక్ హ్యండిచ్చాడు.

Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి? 

also read: తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: కేటీఆర్‌కు సీఎం పదవి? 

జగన్ తో పాటు ప్రగతి భవన్ లోకి వచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డిని ఆలస్యంగా గమనించిన సీఎం కేసీఆర్ ఆయనను పలకరించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో  కేసీఆర్ కు విజయసాయిరెడ్డి పాదాబివందనం చేసేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ వారించారు. అప్పటికే విజయసాయిరెడ్డి కిందకు వంగడంతో కేసీఆర్ ఆయనను పైకి లేపారు..
 

click me!