
హైదరాబాద్ : హైదరాబాద్ లోని బాలాపూర్ పరిధిలో జరిగిన పవన్ అనే యువకుడి హత్య కేసులో మతాంతర వివాహమే కారణంగా తేలింది. బాలాపూర్ షహీన్‌నగర్‌లోని వాడి-ఎ-ఒమర్‌లో బుధవారం అర్థరాత్రి 22 ఏళ్ల వ్యక్తిని బాధితుడి భార్య మేనమామలు, ఆమె తల్లిదండ్రులు హత్య చేసినట్టుగా తేలింది. వారి మతాంతర వివాహాం నచ్చకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. అతడి కోసం కాపుకాచి కత్తితో పొడిచి చంపారు.
బాధితుడిని దేగావత్ పవన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. నిందితులు మహ్మద్ గౌస్, మహ్మద్ సద్దాం పవన్ ను చంపడం కోసం అతని ఇంటి బయట కాపుకాచారని చెప్పారు. రాత్రి 11.40 గంటలకు యూరినేట్ కోసం పవన్ బయటకు వచ్చినప్పుడు, ఇద్దరూ అతని మీద కత్తితో దాడి చేశారు. వారినుంచి అతను తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తగా అతడిని వెంబడిస్తూ.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచారు. పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
బాలాపూర్‌లో దారుణం.. అర్దరాత్రి సమయంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన యువకుడి దారుణ హత్య..
పవన్ బంధువు సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “దాడి జరగడంతో పవన్ సహాయం కోసం అరిచాడు. అతని భార్య, పిల్లలు సహాయం కోసం కేకలు వేయడం విని నేను అతని ఇంట్లోకి పరిగెత్తాను. నేను ఇంట్లోకి అడుగుపెడుతుండగా.. రక్తం మరకలున్న కత్తులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు నన్ను నేలపైకి నెట్టి బైక్‌పై తప్పించుకున్నారు’ అని తెలిపాడు.
కేకలతో మేల్కొన్న ఇరుగుపొరుగు వారు పవన్ ఇంటికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న పవన్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. బాధితుడి ఛాతీ, పొట్ట, వీపుపై కత్తిపోట్లు ఉండడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పవన్ తండ్రి దేగావత్ ఫూల్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మా స్వస్థలం నాగర్‌కర్నూల్‌లోని వెల్దండ గ్రామానికి చెందిన అమ్మాయిని పవన్ పెళ్లి చేసుకున్నాడు.పెళ్లికి ముందు కూడా, అతను మాతో పాటు వాడి-ఎ-ఒమర్‌లో నివసిస్తున్నాడు.
ఈ జంట పెళ్లి విషయంలో నిందితులకు అభ్యంతరం చెప్పడంతో పాటు, నిందితుడికి అతనితో ఆర్థిక వివాదాలు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే సంఘటనకు ముందు తీవ్ర వాగ్వాదం కూడా జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ హత్య మీద చెలరేగిన వివాహం హిందువులపై ముస్లింల దాడిగా చెప్పడాన్ని పోలీసులు ఖండించారు. విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) కార్యకర్త పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ పవన్‌ను ఇతర సాకులతో హత్య చేశారని అది జిహాదీల పనే అని ఆరోపించారు. హిందువుల హత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, పోలీసులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. నేరానికి మత రంగులు వేయవద్దని కార్యకర్తలను హెచ్చరించారు. కొన్ని వర్గాలు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.